పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 278 P.pdf/198

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

21.అనవసరమైన సమ్మెల్లో పాల్గొన్నాం. అల్లరి ముఠాలతో జేరి గొడవలు చేసాం. వస్తునష్టం కలిగించాం.

ప్రార్ధనం

ఓ ప్రభూ! యువజనులమైన మేము సమాజం నీతిన్యాయాలతో ధర్మబద్ధంగా జీవించాలని కోరుకొంటాం. కాని మా వ్యక్తిగత జీవితంలో మేము స్వయంగా ఆ ధర్మస్థాయిని చేరుకోలేక పోతుంటాం. నీవు మా లోపాలను క్షమించు. మా ఆశయాల ప్రకారం జీవించే వరప్రసాద భాగ్యాన్ని కూడ మాకు దయచేయి ఆమెన్!

11. రోగులు

మత్త 9, 17

1.ఒకసారి వ్యాధివాత బడితేనేగాని ఆరోగ్యం విలువ తెలియదు. నేను ఆరోగ్యంగా వున్నపుడు ఆ భాగ్యానికి దేవునికి వందనాలు అర్పిస్తుంటానా?

2.వ్యాధిద్వారా ప్రభువు మన భక్తివిశ్వాసాలను పరీక్షిస్తాడు. ఈ పరీక్షలో నేను నెగ్గుతానా?

3.వ్యాధిబాధల్లో గూడ ప్రభువు నన్ను చేయివిడువక ఆదుకొంటూనే వుంటాడని విశ్వసిస్తుంటానా?

4.వ్యాధిగా వున్నపుడు నిరాశపడుతున్నానా? దేవునిమీద మొరపడుతున్నానా?

5.దీర్ఘకాలం జబ్బుగా పడివున్నపుడు జీవితార్థమేమిటా అని ఆలోచించుకోవడంలోను, ప్రభువుకి ప్రార్ధనం చేసికోవడంలోను కాలం గడుపుతుంటానా?

6.నా వ్యాధి బాధలను సిలువమీద బాధలనుభవించిన ప్రభువు శ్రమలతో ఐక్యంజేసికొని రక్షణాన్ని పొందుతూంటానా? - 1 పేత్రు 2,21,

7.తమ బాధలను మంచి హృదయంతో భరించేవాళ్ళ శ్రీసభకు మేలు చేస్తారన్న విశ్వాసంతో నా వ్యాధిని ఓర్పుతో భరిస్తున్నానా? - కొలో 1, 24.

8.నాకు చికిత్స చేసేవాళ్ళకీ, నన్ను పరామర్శించే వాళ్ళకీ కృతజ్ఞత తెలుపు కొంటుంటూనా?

9.నా బాధల్లో ఇతరులకు సదాదర్శం చూపుతుంటానా?

10.నా పూర్వపాపాలకు పశ్చాత్తాపపడి ఈ ప్రస్తుత వ్యాధిని మంచి మనసుతో భరించడం ద్వారా ఆ పూర్వపాపాలకు ప్రాయశ్చిత్తం చేసికొంటున్నానా?