పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 278 P.pdf/199

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ప్రార్ధనం

ఓ ప్రభూ! నీవు సిలువమీద మరణించి మమ్మ రక్షించావు. నీ మరణం ద్వారా మేమగూడ శ్రమలనుభవించాలని సూచించావు. ఈ వ్యాధిద్వారా నేను నీ సిలువ మరణంలో పాలుపొందుతున్నాను. కనుక నేను ఈమంచి యవకాశాన్ని సద్వినియోగం చేసికొని దీనినుండి సత్ఫలితాన్ని పొందే భాగ్యం దయచేయి - ఆమెన్.

12. మఠవాసులు

1. ప్రార్థనా జీవితం

1. నా జీవితంలో ప్రార్థనకు ఈయవలసినంత ప్రాముఖ్యం ఇస్తుంటానా?
2. నా కష్టసుఖాల్లో జపంద్వారా దేవునితో చనువుగా మాట్లాడ్డం నేర్చుకొన్నానా?
3. నాకు క్రీస్తుపట్ల గాఢమైన భక్తి వ్యక్తిగతమైన అనుభవమూ వున్నాయా?
4. ఆయా కార్యాలను చిత్తశుద్ధితో చేయడంద్వారా నా పనికీ ప్రార్థనకీ పొత్తు కుదుర్చుకొంటున్నానా?
5. తీరిక సమయాల్లో లేనిపోని ఆలోచనలతో మనసు నింపుకోక, హృదయాన్ని ధ్యానాత్మకంగా వుంచుకొంటున్నానా? 6. నా భక్తిక్రియలద్వారా ప్రజలు నాయందు దైవసాన్నిధ్యాన్ని గుర్తిస్తుంటారా?

2. సామూహిక జీవితం

7. నా జీవితంలో సోదరప్రేమ అతిముఖ్యమైనదన్న సంగతి గుర్తిస్తుంటానా?
8. త్రీత్వంలోని ముగ్గురు దైవవ్యక్తులు సామూహిక జీవితం జీవించినట్లే ఈ లోకంలోని నరులు ప్రేమతో సామూహిక జీవితం జీవించడానికి తోడ్పడ్డం మనం చేయగల్గిన ఉత్తమ కార్యమని గుర్తిస్తుంటానా?
9. దేవుడు నాకిచ్చిన శక్తిసామర్థ్యాలనూ వరాలనూ వినియోగించి తోడి మఠసభ్యుల సామూహిక జీవితాన్ని సుఖమయం చేస్తుంటానా?
10 నా వ్యక్తిత్వాన్నిలాగే తోడి మఠసభ్యుల వ్యక్తిత్వాన్ని గూడ గౌరవాదరాలతో చూస్తుంటానా?