పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 278 P.pdf/195

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

12. క్రీస్తుప్రేమను చూచి నాకు అపకారం చేసినవాళ్ళని క్షమిస్తున్నానా? వాళ్ళకు ప్రతీకారంచేసి వాళ్లమీద పగతీర్చుకోవాలనే కోరికతో లేనుకదా?

3. పరలోకంలోని మీ తండ్రిలాగే మీరూ పరిపూరులైయుండండి

- మత్త 5, 48

1. నాగమ్యం దేవునివైపా లేక లోకం వైపా? నేను నిత్యజీవం కొరకు ప్రాకులాడు తుంటానా? బైబులును పరించి ప్రార్ధనం చేసికోవడంద్వారా, సంస్కారాలను భక్తితో స్వీకరించడంద్వారా, సోదరప్రేమద్వారా పరిశుద్దాత్మను అనుభవానికి తెచ్చుకొంటుంటానా? అసూయ, భోజనప్రీతి, కామం మొదలైన దురుణాలను అదుపులోకి తెచ్చుకొంటున్నానా? నేను సజ్జనుడ్డి ఇతరులు వెధవలు అన్నభావంతో తోడినరులను చిన్నచూపు చూస్తున్నానా? ఇతరుల స్వాతంత్ర్యాన్నీ హక్కులనూ నిరోధించి వాళ్ళ నాచిత్తప్రకారం పోవాలని నిర్బంధం చేస్తుంటానా?

2. నా కాలం, ఆరోగ్యం, బలం మొదలైన వరాలను చక్కగా వినియోగించు కొంటున్నానా? ముగ్గురు సేవకుల సామెత దృష్ట్యా (మత్త 25, 14-30) దేవుడు నాకిచ్చిన శక్తిసామర్థ్యాలను సద్వినియోగం చేసికొంటున్నానా? సోమరితనంగా వండిపోవడంలేదుకదా?

3. జీవితంలో వచ్చే కష్టనష్టాలనూ వ్యాధిబాధలనూ ఓర్పుతో సహిస్తున్నానా? "క్రీస్తుశ్రమల్లో కొదవగా వున్నవాటిని పూరించడం కొరకు” (కొలో 1,24) ఆత్మ నిగ్రహాన్ని ఇంద్రియదమనాన్నీ పాటిస్తున్నానా? ఉపవాసం, ఒక్కప్రాదు అనుసరిస్తున్నానా?

4. పరిశుద్ధాత్మకు ఆలయమై (1కొ6,19) ఉత్థానానికినోచుకొనే నా దేహాన్ని పవిత్రంగా వుంచుకొంటున్నానా? దేవునికి నరులపట్లగల ప్రేమను వ్యక్తంచేసే భార్యాభర్తల ప్రేమజ్యోతిని (ఎఫే 5, 22-38) నా దాంపత్య జీవితంలో నేను పవిత్రంగా నిలబెట్టుకొంటున్నానా? కామక్రియలు, తలపులు, మాటలు మొదలైన వాటిద్వారా నా దేహాన్ని అమంగళం చేసికోకుండా వుంటున్నానా? ఇంద్రియ భోగాలకు లొంగడం లేదుకదా? వినీతి ఒల్లని సినిమాలు, నాటకాలు, వినోద కార్యక్రమాలు పుస్తకపఠనాలు మొదలైనవాటిల్లో పాల్గొంటున్నానా? దిగజారిపోయిన నా జీవితాన్ని చూచి ఇతరులుకూడ పాపం కట్టుకోవడానికి కారణమౌతున్నానా? వివాహ జీవితానికి సంబంధించిన నైతిక సూత్రాలను పాటిస్తున్నానా?