పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 278 P.pdf/194

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

4.నా జీవితం నేను భద్రమైన అభ్యంగనంలో పొందిన ఆదేశాలకు న్యాయం చేకూర్చేలా వుంటుందా? నేను శ్రీసభ పేషితోద్యమంలోను, నా విచారణయొక్క సేవా జీవితంలోను పాలుపంచుకొంటున్నానా? శ్రీసభ అక్కరల్లో నా చేతనైనంతవరకు సహాయం చేస్తుంటానా? శ్రీసభ ఐక్యత కొరకూ, అభవృద్ధికొరకూ, వేదప్రచారం కొరకూ ప్రార్ధిస్తుంటానా? ఇంకా లోకంలో శాంతీ సాంఘికన్యాయమూ నెలకొనేందుకుగూడ ప్రార్ధిస్తుంటానా?

5.నేను దేశ శ్రేయస్సుకొరకు పాటుపడుతుంటానా లేక నా లాభం నేను చూచుకొంటుంటానా? దేశంలో న్యాయమూ నీతీ సమైక్యతా ప్రేమా సుహృద్భావమూ నెలకొనేలా కృషిచేస్తుంటానా? మంచిపౌరుడనుగా జీవిస్తుంటానా? చెల్లించవలసిన పన్నులు చెల్లిస్తుంటానా?

6.నా వృత్తికి న్యాయం చేకూరుస్తున్నానా? నా పనిని చిత్తశుద్ధితో చేసి సమాజానికి యథార్థమైన సేవ చేస్తున్నానా? నా క్రింద పని చేసేవాళ్ళకి ఉచితమైన వేతనాలు చెల్లిస్తున్నానా? ఆయా కార్యరంగాల్లో ఇతరులతో చేసికొన్న ఒప్పందానికి కట్టుబడి వుంటున్నానా?

7.న్యాయసమ్మతంగానే అధికారంలో వున్నవాళ్ళకి విధేయతా గౌరవమూ చూపుతుంటానా?

8.నేను ఏదైనా పెద్దపదవిలో వుంటే దాన్ని నా స్వార్ధలాభానికి వాడుకోకుండా వుంటానా? ఆ పదవిద్వారా తోడి జనానికి నిజమైన సేవ చేస్తానా?

9.నేను నిజాయితీపరుట్టేనా? సత్యవంతుట్టేనా? మోసం, నింద, చాడీలు, చెడ్డగా తలంచడం, రహస్యాలను వెల్లడి చేయడం మొదలైన దుష్కార్యాల ద్వారా ఇతరులకు కీడుచేయడం లేదు కదా?

10.నేను హింసకు పాల్పడి ఇతరులకు ప్రాణనష్టం, అవయవ నష్టం కలిగించలేదుకదా? ఇతరుల మంచిపేరుకు, ఆస్తిపాస్తులకు, ఆదాయానికి నష్టం కలిగించలేదుకదా? ఇతరులను గర్భస్రావానికి పరికొల్పలేదుకదా? ఇతరులపట్ల పగను పెంచుకోలేదుకదా? తగాదాలతోను కోపతాపాలతోను ఇతరులతో సంబంధం తెంచుకొని వాళ్ళ వుద్యమాలనుండి వైదొలగలేదుకదా? ఇతరుల నిర్దోషత్వాన్ని రుజువుచేస్తూ సాక్ష్యం చెప్పవలసివచ్చినపుడు స్వార్థబుద్ధితో వెనుకడాలేదుకదా? నేను ఇతరుల సౌతును అపహరించానా? ఆశించానా? పాడుచేసానా? ఇతరులసొమ్ము కొట్టేసినపుడు వాళ్ళకి నష్టపరిహారం చేసానా?