పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 278 P.pdf/196

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

5. నా అంతరాత్మ ప్రబోధం ప్రకారం జీవిస్తుంటానా? లోకాన్ని మెప్పించడానికీ, డంబంవల్లా వేషధారితనానికి పూనుకొంటుంటానా?

6. దేవుని బిడ్డలు ఆత్మద్వారా స్వతంత్ర జీవితం జీవిస్తారు (గల 5,13) అనే సూత్రాన్ని బట్టి, నేను ఆంతరంగికమైన స్వేచ్ఛతో జీవిస్తున్నానా? నాలోని దుష్టవాంఛలకూ ఆశాపాశాలకూ దాసుణ్ణి కావడం లేదుకదా?

7. పాపసంకీర్తన సంస్కారాన్ని భక్తిశ్రద్ధలతో స్వీకరిస్తున్నానా? దానిద్వారా పాపాన్నుండి వైదొలగి దేవునితో రాజీపడుతున్నానా? లేక సోమరితనంతో దాన్ని అశ్రద్ధ చేస్తున్నానా? పాపోచ్చారణంలో బుద్ధిపూర్వకంగానే కొన్ని పాపాలు చెప్పకుండా దాచివుంచుతున్నానా? గురువు విధించిన ప్రాయశ్చిత్తం చెల్లిస్తున్నానా? ఇతరులకు నష్టపరిహారం చెల్లిస్తున్నానా? దేవుని యెదుట చేసిన వాగానాలను నెరవేరుస్తున్నానా? నా జీవితం రోజురోజుకి మంచికి మారుతుందా?

ప్రార్ధనం

ఓ ప్రభూ! ఏ నరుడు నీపట్ల భక్తితోను, తోడిజనులపట్ల ప్రేమతోను, తనపట్ల తాను చిత్తశుద్ధితోను జీవిస్తాడో అతనికి నీవు తప్పక దర్శనమిస్తావు. విశుద్ధ హృదయులు దేవుణ్ణి దర్శిస్తారని నీవే వాకొన్నావు. కనుక మేము ఈలోకంలో నిర్మలంగా జీవించి పరలోకంలో నీదర్శన భాగ్యానికి నోచుకొనే వరాన్ని మాకు దయచేయి - ఆమెన్.

10. యువజనం

ఎఫే 6, 1-3

1. ప్రభూ! మా జీవితంలోవచ్చే రోజువారి సంఘటనల్లో నీ సాన్నిధ్యాన్ని గుర్తించలేకపోయాం. జవాబు - ఇందుకుగాను నీవు మమ్ము క్షమించు. 2. మేము కొన్నిసార్లు పరధ్యానంతో ప్రార్ధనం చేసాం. కొన్నిసార్లు అసలు ప్రార్థించనేలేదు.

3. మేము మా తల్లిదండ్రులనూ బంధువులనూ పెద్దలనూ ఆదరంతో చూడలేదు.

4. మేము ఇతరుల భావాలను విలువతో చూడలేదు. వాళ్ళ యిష్ణానిష్ణాలను పట్టించుకోలేదు.

5. నీవు మా కిచ్చిన శక్తిసామర్థ్యాలను అభివృద్ధి చేసికోకుండా సోమరితనంగా కాలం వెళ్ళబుచ్చాం.