పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 278 P.pdf/183

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

3. ధనికులకు అనర్ధం (లూకా 6,24) అన్న వాక్యందృష్ట్యా నేను ధనికుడనా? నా సంపదలు నన్ను దేవునినుండీ తోడి నరులనుండీ దూరం చేస్తున్నాయా?

4. నేను డబ్బు, అధికారం, ఉద్యోగం, డిగ్రీలు, పేరుప్రతిష్టలు మొదలైనవాటిని దేవునికంటె గూడ అధికంగా ప్రేమిస్తున్నానా?

5. అన్యాయమార్గంలో సొమ్ము సంపాదిస్తున్నానా! డబ్బుకి దాసుడనై పోతున్నానా?

6. నేను గత్యంతరం లేక దరిద్రుడనుగా వున్నాగానీ నా హృదయంలో వస్తువులను కూడబెట్టుకోవాలనే కోర్కెలు లేవా?

7. నేను చేసిన అప్పలు మట్టసరిగా తీరుస్తుంటానా?
8. నేను పేదల మీద దయజూపి వాళ్ళకు నాకు చేతనైన దాన ధర్మాలు చేస్తుంటానా?

8. కూటసాక్ష్యం పలుకకుందువు గాక

1.నా తలంపులకీ మాటలకీ చేతలకీ పొందిక వుంటుందా?

2. నాకు సత్యప్రీతి, కష్టాలు వచ్చినా అసత్యం చెప్పకూడదు అనే నిష్ణా వున్నాయా?

3. నేను రహస్యాలను దాచి వుంచగలనా?

4. నేను ముఖస్తుతులు చేస్తుంటానా? డంబం చూపెడుతుంటానా?

5.నేను ఇతరులలోని మంచిని గుర్తిస్తుంటానా? ఇతరులను గూర్చి మంచిగా మాట్లాడుతుంటానా?

6.ఇతరుల మేలెంచి వాళ్ల తప్పలను వాళ్లకు ధైర్యంగా తెలియజేస్తుంటానా?

7. ఇతరులు ఎదుట లేనపుడు వాళ్లను విమర్శిస్తూంటానా? నా యెదుట ఇతరులను విమర్శించేవాళ్లను మందలిస్తానా?

8.ఇతరులమీద చాడీలు చెప్మంటానా? నిందలు మోపుతుంటానా?

9. నేను ఇతరులు చెప్పేది సావధానంగా వింటూంటానా? వాళ్ళ చెప్పేది సానుభూతితో అర్థంచేసికొని, వాళ్ల గొడవలను కాస్త పట్టించుకొంటుంటానా?

ప్రార్ధనం

ఓ ప్రభూ! నీ యాజ్ఞలను పాటించిన వాళ్ళకు నీవు నీ దర్శన భాగ్యాన్ని దయచేస్తావు. కనుక మేము ఈ లోకంలో నీ శాసనాలను ప్రేమభావంతో పాటించి పరలోకంలో మోక్షబహుమానాన్ని చూరగొనే భాగ్యాన్ని దయచేయి - ఆమెన్