పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 278 P.pdf/184

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

4. కృషి

1.భగవంతుడంతటివాడు ఆరునాళ్ళ కృషిచేసి భూమ్యాకాశాలను సృజించాడు ఆది 2,1-3. నరమాత్రుడనైన నేను పనిచేయవద్దా? 2.ఆదాము భాగ్యవంతమైన స్థితిలో వున్నపుడు కూడ ఏదెను .SSoé5° 8°&סח9סכ&3כ పనిచేసేవాడు -ఆది -2,15, మరి నేను పనికి జంకవచ్చా? 3.చీమలను చూచి సోమరియైన నరుడు జ్ఞానం తెచ్చుకోవాలి అన్నాడు సామెతల గ్రంథకర్త - 6, 6-9. నేను సోమరిపోతునైతే చెల్లుతుందా? 4. సొలోమోను ఏడేండ్ల కృషిచేసి దేవునికి సుందరమైన దేవాలయం కట్టించాడు - 1రాజు 6,38. దేవునికి నేను కట్టే దేవాలయమూ, నా కృషీ యేమిటివి? 5. ప్రభువు స్వర్గంలోని దేవదూతల్లోనే తప్పపడతాడు- యోబు - 15, 15-16 అలాంటప్పుడు అరకొరలుగా పనిచేసే మనలను అతడు మెచ్చుకొంటాడా? 6.క్రీస్తు అన్నిపనులూ చక్కగా చేసాడు - మార్కు 7, 37. నేను నాపనులను పట్టీపట్టనితనంతో చేస్తే ఆ ప్రభువుకి ప్రియపడతానా? 7.పండ్లనుబట్టి చెట్టను నిర్ణయించాలి — మత్త 7, 16-20. ఆలాగే నరులను వాళ్ళు 志総 పనులనుబట్టి నిర్ణయించాలి. నేను మంచిపండుకాసే మామిడి చెట్టు లాంటివాడినా లేక పాడుకాయలు కాసే ఉమ్మెత్త చెట్టులాంటివాడినా? 8.నేను సేవలు చేయించుకోవడానికి రాలేదు, సేవలు చేయడానికి వచ్చాను అన్నాడు ప్రభువు - మార్కు 10,45. నా పని ద్వారా నేను ఇతరులకు నిజంగా సేవచేస్తున్నానని చెప్పగలనా? 9.తాను తీసికొన్న సొమ్ముని వృద్ధిచేయని మూడవ సేవకుణ్ణి యజమానుడు నీవు సోమరిపైన చెడ్డదాసుడివి అని చీవాట్లు పెట్టాడు - మత్త 25, 26. ఈ తిట్ట నేడు నాకు కూడ వర్తించదుగదా? 10.మనం చేయవలసిన పనులన్నీ చేసాక గూడ "మేముఅయోగ్యులమైన సేవకులం. మా కర్తవ్యం ప్రకారం మేము చేయవలసిన పని చేసాం. మేము అధికంగా చేసిందేముంది?" అనుకోవాలి - లూకా 17,10, నేను కొద్దిగా చేసి ఆ చేసిన దానిని గూర్చి గొప్పగా చెప్పకోవడం లేదా? నా డప్ప నేను వాయించుకోవడం లేదా? 11.పనిచేయనివాడు కూడు తినడానికి అరుడు కాడు అన్నాడు పౌలు - 2తెస్స3,10. నేను కష్టపడి పనిచేసేవాడినా లేక వళ్ళ దాచుకొనేవాడినా?