పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 278 P.pdf/182

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

7.నన్నువలె నా పొరుగువాళ్ళను ప్రేమిస్తుంటానా?

8.ఆ మంచి సమరయునిలాగే అక్కరలో వున్నవాళ్ళని నా శక్తికొలది ఆదుకొంటుంటానా?

9.వికలాంగులూ పేదసాదలూ వ్యాధిగ్రస్తులూ బాధార్తులూ మొదలైవాళ్లపట్ల విశేష కరుణ చూపుతుంటానా?

10. ఇతరులకు దురాదర్శాన్ని చూపి, వాళ్ళ దైవభక్తినీ, నైతిక నిష్ణనూ చెడగొడు తుంటానా?

11.. ఇతరుల విజయంపట్ల సంతోషమూ, పరాజయంపట్ల విచారమూ తెలియ జేస్తుంటానా?

12..తోడి నరుల్లో క్రీస్తుని గుర్తిస్తుంటానా? వాళ్ళ ద్వారా అతన్ని అనుభవానికి తెచ్చుకొంటుంటానా?

13.నాలోవున్న క్రీస్తుని ఇతరులకు చూపించడానికీ, ఇతరులతో పంచుకోవడానికీ సిద్ధంగా వుంటానా?

6. మోహపాపాలను చేయకుందువుగాక

9. మోహ తలంపులను తలంపకుందువుగాక

1.నా దేహంలోను, నా దేహంతోను పాపం చేయకుండా వుంటుంటానా? (1కొరి. 6, 18-19) 2.ఇతరులమీద నా హృదయంలో లైంగికమైన వాంఛలేమైనా వున్నాయా? 3.భగవంతుడు ఆసీనుడు కావలసిన నా హృదయ సింహాసనంమీద ఏ మానుషవ్యక్తినైనా కూర్చోబెడుతున్నానా? 4.నేను చదివే పుస్తకాలూ పత్రికలూ నాలోని లైంగికవాంఛలను రెచ్చగొట్టేలా వుంటాయా? 5.నిష్కలంకమాత హృదయంలాగే నా హృదయం కూడ దేవుణ్ణి తోడి నరుజ్జీ నిర్మలమైన ప్రేమతో ప్రేమిస్తుందా?

7. దొంగిలింపకుందువుగాక

10. పరుల సొమ్మును ఆశింపకుందువు గాక

1.నేను ఇతరుల వస్తువులను కాజేస్తుంటానా?

2. పేరాసతో వస్తువులను కూడబెట్టుకొంటుంటానా