పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 278 P.pdf/162

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అతడు దేవుని వాక్కులను జాగ్రత్తగా ఆలించేవాడు. వాటిని అన్నంలాగా ప్రీతితో భుజించేవాడు. ఆ పలుకులు అతనికి ఆనందాన్ని కలిగించాయి. అతడు ప్రజల ఆనందాల్లో పాల్గొనలేదు. దేవుడే నా ఆనందం అనుకొని వంటరిగా వుండిపోయాడు. నేడు మనం ప్రభువు వాక్యాన్ని శ్రద్ధతో పఠించి, భక్తితో మననం చేసికోవాలి. దాన్ని అన్నంలాగ భుజించి ఆధ్యాత్మిక బలాన్ని పొందాలి.

11. నీ వాక్కునా హృదయంలో అగ్నిలా - యిర్మీ20,9

ప్రభువు తన వాక్కునెత్తి యిర్మీయా $ტჭტ° పెట్టాడు. కాని ప్రజలు అతని బోధలు వినలేదు. అతని నోరు నొక్కేయాలని చూచారు. ప్రభువు పలుకు మాత్రం యిర్మీయా హృదయంలో వుండి అగ్నిలా మండజోచ్చింది. నీవు నన్ను ప్రజలకు బోధించు, బోధించు అని ప్రవక్తను నిర్బంధం చేసింది. ప్రవక్త ఆ యగ్నిని ఆపుకోలేక బోధ చేసాడు. ప్రజలు మాత్రం అతని బోధను పెడచెవిని బెట్టారు. వేదబోధకులకు ఆంతరంగికమైన తపన వండాలని ఈ సంఘటనం మనకు నేర్పుతుంది. బోధకుడు దైవశక్తితో, ఆంతరంగిక ప్రేరణతో బోధించాలి.

12. ఓనియా యిర్మీయాల ప్రార్థన -2 మక్క 15, 12-16

యూదా గ్రీకు సైనికాధికారియైన నికానోరుతో యుద్ధం చేస్తున్నాడు. అతడు దర్శనంలో ప్రధాన యాజకుడైన ఓనియాను చూచాడు. ఆ యుద్ధకాలంలో ఓనియా యూదుల విజయం కొరకు ప్రార్థన చేస్తున్నాడు. అటుపిమ్మట యూదా దర్శనంలో యిర్మీయా ప్రవక్తను గూడ చూచాడు. ఈ ప్రవక్త యూదులను గాఢంగా ప్రేమించి వారికొరకూ పవిత్ర నగరం కొరకూ ప్రార్థన చేస్తున్నాడు. అతడు యూదాకు బంగారు కత్తినిచ్చి దీనిని దేవుడు నీకు కానుకగా పంపాడు. నీవు దీనితో శత్రువులను హతమార్చు అని చెప్పాడు. ఈ యిద్దరు ప్రార్థనామూర్తుల జపాల ఫలితంగా తర్వాత యూదా శత్రువులను జయించాడు. కష్టాల్లో ఆపదల్లో ప్రార్థన మనకు విజయాన్ని చేకూర్చి పెడుతుందని ఈ కథ భావం. కనుక మన శ్రమల్లో మనం తప్పక దేవుని శరణు వేడాలి.

13. హిజ్కియా ప్రార్ధనం = యెష37, 9-19

అస్పిరియా రాజైన సనెర్రీబు యూదా మీదికి దండెత్తి వచ్చాడు. అతడు యూదా రాజైన హిజ్కియాకు జాబు పంపాడు. దానిలో ఇట్లుంది. “నీ దేవుడైన యావే ఈ యేరూషలేము నగరాన్ని కాపాడలేడు. మేము ఎన్నో రాజ్యాలు, పట్టణాలు నాశంచేసాం. వాటి దేవుళ్ళు ఆ నగరాలను కాపడలేకపోయారు. నీ దేవుడు మాత్రం ఈ నగరాన్ని ఏలా

154