పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 278 P.pdf/161

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

7. దేవాలయ ప్రార్ధన - 1 రాజు 8,30-40

సొలోమోను ఏడేండ్ల శ్రమించి దేవాలయాన్ని కట్టి దాన్ని దేవునికి అంకితం చేసాడు. ఆ సందర్భంలో అతడు సుదీర్ఘమైన ప్రార్థన చేసాడు. ఇది బైబుల్లోని గొప్ప ప్రార్థనల్లో వొకటి. ప్రజలు పశ్చాత్తాపపడినపుడు దేవుడు వారి మొర వినాలి. కరువు కాటకాల్లో మొరపెట్టినపుడు దేవుడు వానలు కురిపించాలి. యిప్రాయేలీయులు యుద్దాల్లో ప్రార్థన చేసినపుడు వారికి విజయాన్ని ప్రసాదించాలి. వ్యాధిబాధలు అంటు రోగాల్లో వేడుకొంటే దేవుడు ఆ బాధలు తొలగించాలి. సాలోమోను ప్రార్ధనం మనకు కూడ జపం నేర్పుతుంది.

8. రాజు బాధ్యతలు - 1 రాజు 3,6-10

సొలోమోను యువకుడుగా వున్నపుడే రాజయ్యాడు. తండ్రి దావీదుకున్న అనుభవం అతనికి లేదు. కనుక అతడు గిబ్యోను పుణ్యక్షేత్రంలో దేవునికి ప్రార్థన చేసాడు. ప్రజలను మంచిచెడ్డలెంచి పరిపాలించే వరాన్నీ వారికి న్యాయబుద్ధితో తీర్పుచెప్పే వివేకాన్నీ దయచేయమని వేడుకొన్నాడు. దేవుడు సంతోషించి అతనికి విజ్ఞానమూ సిరిసంపదలూ అన్నీ ప్రసాదించాడు. ప్రజలను చక్కగా పరిపాలించడం, న్యాయబుద్ధితో తీర్పులు చెప్పడం రాజధర్మాలు. ఇక్కడ సాలోమోను రాజుగా తన బాధ్యతను తాను నెరవేర్చాలని వేడుకొన్నాడు. నేడు మనంకూడ మన బాధ్యతలను సంతృప్తికరంగా నెరవేర్చే భాగ్యాన్ని దయచేయమని దేవుణ్ణి అడుగుకోవాలి.

9. మా పాపాలు సముద్ర గర్భంలో పడవేయి - మీకా 7, 18-19

బైబులు భగవంతుడు కరుణామయుడు. నరుల పాపాలను పూర్తిగా క్షమించేవాడు. కనుక మీకా ఈలా ప్రార్థించాడు. "స్వామీ! నీవు మా పాపాలను నీ కాళ్లతో తొక్కి నాశంజేయి. వాటిని విసరి సముద్ర గర్భంలో పడవేయి". సముద్రంలో పడిన వస్తువు తిరిగిరాదు. పూర్తిగా నాశమౌతుంది. దేవుడు మన పాపాలనుకూడ ఈలాగే ధ్వంసం చేయాలనిభావం. మనం పాపసంకీర్తనం చేసికొనేపడు ఈ వేదవాక్యాలు ధ్యానింపదగినవి. పాపాలకు పశ్చాత్తాప పడేపడూ వీటిని వాడుకోవచ్చు.

10. నేను నీ పలుకులు భుజించాను - యిర్మీ 15, 16-18

ಯಲ್ಕಿಯಿ' మహా ప్రవక్త, అతడు చాల శ్రమలు అనుభవించాడు. ప్రజలు అధికారులు అతనికి శత్రువులయ్యారు, ఆ శ్రమల్లో అతడు దేవుణ్ణి శరణు వేడాడు. నేను నీవాణ్ణి. నీ దాసుడ్డి అని చెప్పకొన్నాడు. ప్రవక్తగా దేవుడు అతనితో మాట్లాడేవాడు. 153