పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 278 P.pdf/160

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తిప్పలేదు. నీవే వీరికి తల్లివి, దాదివి, ఇప్పడు వీరికి మాంసాన్ని దయచేయవేని నన్ను చంపివేయి. అప్పడు నేను వీరి బాధను కన్నులార చూడను అని ప్రార్థన చేసాడు. మహాభక్తులు ప్రజల కొరకు ఎంతటి త్యాగాన్ని చేయటానికైనా సిద్ధంగా వుంటారు.

4. ఐగుప్తియులు ఆడిపోసికోరా? - ద్వితీ 9,26–29

యిస్రాయేలీయులు తలబిరుసు జనం. వాళ్లిప్పుడూ దేవునిమీద తిరగబడేవాళ్ళ కనుక దేవుడు వారిని హతమార్చాలనుకొన్నాడు. మోషే వారికొరకు విజ్ఞాపనం చేసాడు. దేవా! నీవు ఈ ప్రజను నాశంజేస్తే ఐగుప్రీయిలు నిన్ను ఆడిపోసికోరా! యావే ఈ ప్రజను కనాను దేశానికి చేర్చలేక మోసంతో ఎడారిలో చంపివేసాడని నిన్ను నిందించరా అని మొరపెట్టాడు. అతని వేడుకోలును ఆలించి దేవుడు ఆ ప్రజల తప్పిదాలు క్షమించాడు పునీతులు దేవునికి పసిబిడ్డల్లాగ నిష్కపటంగా ప్రార్థన చేస్తారు.

5. దేవుని ముఖకాంతి మీపై ప్రకాశించుగాక - సంఖ్యా 6, 24-26

యాజకులు యిస్రాయేలును ఈలా దీవించేవాళ్లు, "యావే మిమ్మ దీవించి కాపాడునుగాక. తన ముఖకాంతిని మీపై ప్రకాశింపజేయునుగాక. మిమ్ము కృపతో జూచి మీకు సమాధానము దయచేయునుగాక". ప్రభువు దీవెన మనకు అండ. అతని ముఖకాంతి మనపై బడినపుడు మనం బ్రతికిపోతాం. అతని కరుణవల్ల మనకు శాంతి లభిస్తుంది. ఇది మంచి ప్రార్ధనం. మనమందరం చెప్పకోదగింది. దేవుని దీవెనే మనకు అండ.

6. శాపానికి మారుగా దీవెన - 2 సమూ 16,5-13

దావీదు సౌలు కుటుంబాన్ని యుద్ధంలో నాశం జేసాడు. తర్వాత దావీదు కుమారుడు ജ്ജീ తండ్రిని నగరంనుండి తరిమివేసాడు. దావీదు పారిపోతూండగా సౌలు అనుయాయి షిమీ అతన్ని తిట్టాడు. అతనిమీద రాళ్ళు రువ్వాడు. సౌలుని నాశంచేసినందుకు దేవుడు నీకు శాస్తి చేసాడులే అని పల్కాడు. దావీదు అనుచరులు అతన్ని శిక్షింపబోయారు. కాని ఆ రాజు "దేవుడే ఇతన్ని నామీదికి పరికొల్పి వుండవచ్చు. ప్రభువు నా దైన్యాన్ని గుర్తించి ఇతని శాపానికి మారుగా నాకు దీవెనలు ఇస్తాడు" అని పల్మాడు. అవమానంలో గూడ అంతటి వినయాన్ని చూపిన ఆరాజు మహా భక్తుడై యుండాలి. వినయంతో గూడిన ప్రార్ధన దేవునికి ఎంతో ప్రీతి కలిగిస్తుంది. అల్పులమైన మనం దేవుని ముందు చాగిలపడాలి.

152