పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 278 P.pdf/163

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కాపాడతాడు? కనుక నీవు మాకు లొంగిపో", హిజ్మియా ఆ జాబును దేవళంలో ప్రభువు పీఠంపై పెట్టి కన్నీటితో ప్రార్థన చేసాడు. ప్రభూ! నీవొక్కడివే దేవుడవు, సృష్టికర్తవు. అస్సిరియా రాజులు నాశంచేసిన నగరాల దేవుళ్ళ దేవుళ్ళేకాదు. సజీవుడవైన నీవు మమ్మ కాపాడు అని వేడుకొన్నాడు. దేవుడు ఆరాజు మొర విన్నాడు. ఆరాత్రే ప్రభువు దూత అస్పిరియా సైన్యంలో 185 వేల మందిని చంపివేసాడు. సనైరీబు భయపడి పారిపోయాడు. ఆపదల్లో, హింసల్లో ప్రార్థన మనకు కొండంత బలాన్నిస్తుంది. మానుష బలంకంటె దైవబలం కోటిరెట్ల శక్తి కలది.

14. జ్ఞాని కోరిన రెండు వరాలు = సామె 30, 7-9

జ్ఞాని దేవుణ్ణి రెండు వరాలు అడిగాడు. మొదటిది అబద్ధాలు ఆడకుండేలా చేయి అన్నాడు. దేవుడు సత్యవంతుడు. అబద్దాలు అతనికి నచ్చవు. రెండవది, నన్ను ధనికుణ్ణి చేయవద్దు దరిద్రుడ్డీ చేయవద్దు అన్నాడు. నాకు కావలసినంత తిండి మాత్రం దొరికేలా చేయి అన్నాడు. ఎందుకు? తాను ధనికుడైతే పొగరెక్కిదేవుణ్ణి ధిక్కరించవచ్చు. దరిద్రుడైతే దొంగతనానికి పాల్పడి దేవునికి అపఖ్యాతి తేవచ్చు. కనుక తాను ధనికుడు దరిద్రుడూ కాకుండా మధ్యస్థంగా వుండడం మేలనుకొన్నాడు. నేడు మనం కూడ ఈ ప్రార్ధనం చేస్తే బాగుంటుంది. ఎల్లప్పుడు భగవంతుని విూద మనసు నిలిపి వుంచేవాడు ధన్యుడు.

15. జ్ఞాన వరం - సాలోమోను జ్ఞాన 9,9-18

సాలోమోను మహాజ్ఞాని. అతడు దేవునికి ప్రార్ధనచేసి జ్ఞాన వరాన్ని పొందాడు. ఆరాజు ప్రభువుకి ఇలా మనవి చేసాడు. “నీ సింహాసనం నుండి జ్ఞానాన్ని నా యొద్దకు పంప, అది నాతో కలిసి పనిచేస్తుంటే నేను నీకు ప్రీతికరమైనదేదో తెలిసికొంటాను. నా యంతట నేను నీకు ఇష్టమైన కార్యాలు చేయలేను. అసలు నీ చిత్తమేమిటో నాకు తెలియదు. నా దేహం నా ఆత్మను క్రుంగదీస్తుంది. నా మట్టి శరీరం నా బుద్ధిశక్తిని అణచివేస్తుంది. నీవు స్వర్గం నుండి నీ జ్ఞానాన్ని నీ యాత్మనీ పంపితేనే తప్ప నేను నీ చిత్తాన్ని తెలిసికోలేను". ప్రభువు ఆ రాజు మనవి ఆలించి అతనికి జ్ఞానవరాన్ని దయచేసాడు. ఈ జ్ఞానాన్నే మనం నూత్నవేదంలో వరప్రసాదం అంటాం. దీనికి కర్త పవిత్రాత్మ కనుక మనం ఆత్మ నుండి జ్ఞానవరాన్ని అడుగుకోవాలి. ఈ వరం వలన మనం దేవుని చిత్తాన్ని తెలిసికొని అతనికి ప్రీతి కలిగించే పనులు చేస్తాం. పవిత్రంగా జీవిస్తాం.

155