పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 278 P.pdf/159

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది
               

8.బైబులు భక్తుల ప్రార్థనలు

                                                  బైబులు భాష్యం - 148

1. అబ్రాహాము మనవి = ఆది 18,27-33


అబ్రాహాము సౌదొమ గొమర్రా పట్టణాల కొరకు దేవునికి మనవిచేసాడు. ఆ నగరాల్లో 50 మంది భక్తిపరులుంటే వారిని కాపాడమని అడిగాడు. ఆ సంఖ్యను 45, 40, 80, 20, 10 దాకా తగ్గిస్తూ వచ్చాడు. చివరకు ఆ నగరాల్లో పదిమంది భక్తిమంతులుకూడ లేరు. కనుక దేవుడు ఆ పరాలను నాశంచేయవలసి వచ్చింది. జనులు మంచివాళ్ళయినా చెడ్డవాళ్ళయినా మన తరపున మనం వారికొరకు ప్రార్థించవలసిందే. మన విజ్ఞాపనం వలన ఎందరికో మేలు కలుగుతుంది.

2. మోషే విజ్ఞాపనం - నిర్గ 32, 30-32


యిస్రాయేలు ప్రజలు ఈజిప్టునుండి బయలుదేరి రాగానే సీనాయి దగ్గర బంగారు దూడను కొల్చి యూవేకు కోపం రప్పించారు. అతడు వారిని నాశంచేసి మోషేనుండి క్రొత్త ప్రజను పుట్టించాలనుకొన్నాడు. కాని మోషే అందుకు అంగీకరించలేదు. అతనికి ఆ ప్రజలంటే ప్రీతి. కనుక అతడు నీవు ఈ ప్రజల పాపాన్ని మన్నించనైనా మన్నించు, లేదా నీ జీవగ్రంథం నుండి నాపేరు కొట్టివేయనైనా కొట్టివేయి అని మనవిచేసాడు. యూదులు దేవుడు తన భక్తుల పేర్లను ఓ గ్రంథంలో వ్రాసివుంచుకొంటాడనీ, వారిని తప్పక రక్షిస్తాడనీ నమ్మారు. ఇక్కడ మోషే చిత్తశుద్ధి మనకు ఆశ్చర్యం కలిగిస్తుంది. అతడు తన ప్రజ నాశమైతే తన పేరునుగూడ జీవ గ్రంథంనుండి తుడిచివేయాలని కోరుకొన్నాడు. తాను జాతిపిత కావడం, తన సంతానం కనాను దేశాన్ని ఆక్రమించుకోవడం ముఖ్యంకాదు. యావే ఎన్నుకొన్న ప్రజ బ్రతికిపోవడం ముఖ్యం. స్వార్థం లేనివాళ్లేగాని గొప్ప ప్రార్థనలు చేయలేరు.

3. నన్ను చంపివేయి - సంఖ్యా 11, 10-15


యిస్రాయేలు ప్రజలకు ఏడారిలో మాంసం తినాలనే కోరిక పట్టింది. వాళ్ళు మోషేమీద నిషురాలు పలికారు. అతనికి వారిమీద జాలి కలిగింది. అతడు ప్రభూ! నేను ఈ ప్రజల బాధను చూడలేను. నేను వీరిని ఓ తల్లిలా కనలేదు. ఓ దాదిలా ఎత్తుకొని
151