పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 278 P.pdf/158

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నీవు సిలువమీది నుండి మాకు ఈలా ఉపదేశం చేస్తావు
                "దప్పికగొన్నవాళ్ళ నా చెంతకు రావచ్చు
            నన్ను విశ్వసించేవాళ్ళ నా హృదయం నుండి స్రవించే
            జీవజలాలను పానం చేయవచ్చు
           జీవిత భారాలను మోయలేక యలసియున్నవాళ్ళంతా
           నా చెంతకు రండి, నేను మీ యలసటలను తొలగిస్తాను"
               ప్రభూ! మేము నీ దివ్య హృదయాన్నుండి,
           రక్షణాన్ని దయచేసే నూతిలో నుండి లాగ,
         అమృతమయమైన జలాలను ఆనందంతో సేవిస్తాం
         పరిపూర్ణ జీవనాన్ని దయచేసేవాడివి నీవే
         మా మాటల ద్వారా, అంతకంటే అదనంగా
         మా చేతల ద్వారా, మా జీవితం ద్వారా కూడ
             నీ ప్రేమకు సాక్షులంగావుండే భాగ్యాన్ని
           మాకు తప్పక దయచేయి.

10. క్రీస్తు జీవిత ధ్యేయం

ప్రభూ! నీవు జీవితమంతా
         నీ తండ్రి సేవలోనే గడిపావు
          నీ జీవితంలోని ప్రతిక్షణాన్నీ
        నరుల శ్రేయస్సు కొరకే వినియోగించావు
       అన్ని విలువలకంటె పైవిలువ దేవుడేననీ
       తోడి నరులకు సేవలు చేయడం ద్వారా గాని
          ఆ దేవుణ్ణి పొందలేమనీ
       మాటలతోను చేతలతోను నీవు మాకు బోధించావు
      ఆనాడు సైనికుడు నీ గుండెను ఈటెతో పొడువగా
       దానిలోని చివరి నెత్తురుబొట్ట కూడ కారిపోయింది
      దీని ద్వారా నీ జీవితధ్యేయాన్ని నీవు మాకు
         సంగ్రహంగాను స్పష్టంగాను బోధించినట్లయింది.