పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 278 P.pdf/101

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మన ఆధ్యాత్మిక జీవితం బలపడ్డానికి కొన్ని పరీక్షలు అవసరమే. కాని చాల పరీక్షలు మనలను పాపంలోకి లాగుతాయి. ఈ రెండు రకాల పరీక్షలకు మధ్య వుండే తేడాను తెలిసికొనే వివేకాన్ని ఆత్మే మనకు దయచేస్తుంది. పైగా శోధనలకు గురికావడం వేరు, వాటికి లొంగడం వేరు. ఈ రెండింటికీ గల తేడాను గూడ ఆత్మేమనకు తెలుపుతుంది. ఎప్పడూ గూడ పాపవస్తువు కంటికి ఇంపుగాను ఆకర్షణీయంగాను కన్పిస్తుంది. కాని అది కడన మృత్యువుని ತಬ್ಬಿ ಮೆಣ್ಣೆ విషఫలం ఔతుంది. ఈ సంగతి గూడ ఆత్మ మనకు తెలియజేస్తుంది - ఆది 3,6 శోధనను తప్పించుకోవాలంటే మాత్రం ఆత్మ ప్రసాదించే వివేకం అత్యవసరం.

    పరీక్షవల్ల కొన్ని ప్రయోజనాలున్నాయి. మన ఆత్మ ఏ స్థితిలో వుందో, ఎంతవరకు ఎదిగిందో మనకే తెలియదు. పరీక్ష వచ్చినపుడు మనకున్న పుణ్యమెంతో పాపమెంతో తెలిసిపోతుంది. ఈ విధంగా అది మనకు ఆత్మజ్ఞానం కలిగిస్తుంది.
     మమ్మ శోధనలో చిక్కుకోనీయకు అనే విన్నపం మన హృదయశుద్ధిని తెలియజేస్తుంది.మన సంపద ఎక్కడుందో అక్కడే మన హృదయం కూడ వుంటుంది - మత్త 6,21. ఎవడూ ఇద్దరు యజమానులను సేవింపలేడు - 6,24. మనం ఆత్మను అనుసరించి జీవించే వాళ్ళమైతే ఆ యాత్మ నడిపించినట్లుగా నడచుకోవాలి - గల 5,25, కనుక మనం నిజాయితీతో, పాపానికి దూరంగా వుండాలన్న భావంతో ఈ విన్నపాన్ని జపించాలి, శోధనలో దేవుడే మనకు కావలసిన బలాన్ని దయచేస్తాడు. అతడు మన శక్తికి మించిన శోధనలు రానీయడు. పరీక్షను భరించే శక్తి, దానినుండి బయటపడే బలమూ అతడే దయచేస్తాడు - 1 కొరి 10, 13.
    కాని మనం శోధనను జయించాంలంటే ప్రార్ధన చేయాలి. క్రీస్తు ఎడారి తపస్సులోను, ఒలీవ కొండపై అనుభవించిన ఆవేదనలోను ప్రార్థన ద్వారానే పిశాచశోధనను జయించాడు. మన శోధనల్లో ప్రార్ధనం చేసికొన్నపుడు క్రీస్తు విజయం మనమీద సోకుతుంది. ఐతే ప్రభువు మనం ఎల్లపుడు మన హృదయాన్ని అదుపులో వుంచుకోవాలని కోరుకొంటాడు. కనుక పిచ్చి కోరికలను మన యెదలోనికి రానీయకూడదు. దాన్ని ఎప్పడూ దేవునివైపు త్రిప్పకొంటుండాలి. ఇంకా అతడు శిష్యుల నుద్దేశించి తండ్రీ! నీ శక్తితో వీరిని సురక్షితంగా వుంచు అని ప్రార్థించాడు - యోహా 17,11. ఈ ప్రార్థన నేడు మనమీద సోకితీరుతుంది. పవిత్రాత్మ కూడ మనలను నిరంతరం జాగరూకులనుగా వుంచుతుంది. ఇదంతా మన మేలుకొరకే.
    మన ప్రధాన శోధన మన చివరి గడియల్లో వస్తుంది. అప్పుడు కొందరు ప్రభువుని నిరాకరిస్తారు, కొందరు అంగీకరిస్తారు. ఆ చివరి గడియల్లో మనలను ఆదుకొమ్మని గూడ ఈ విన్నపంలో దేవుణ్ణి అడుగుకొంటున్నాం.