పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 278 P.pdf/100

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

క్షమాగుణం మన జీవితంలో నిత్యసత్యం కావాలి. క్షమించనొల్లని సేవకుని కథ మనకు తెలుసు. అక్కడ ప్రభువు "మీరు మీ తోడివారిని హృదయ పూర్వకంగా క్షమించకపోతే పరలోకంలోని నా తండ్రి కూడ మీ పట్ల ఆలాగే ప్రవర్తిస్తాడు" అన్నాడు - మత్త 18,35, మన్నింపు హృదయంలోనుండి రావాలని చెప్సాం, మనకు అపకారం చేసిన వాళ్ళమీద మనకు కోపం పడుతుంది. వారిమీద పగతీర్చుకోగోరుతాం. కాని పవిత్రాత్మ మనహృదయాన్ని సోకినపుడు మనం అపకారిమీద జాలిజూపుతాం, అతనిమీద కోపాన్ని వదలుకొని అతని కొరకు దేవునికి విన్నపం చేస్తాం. ఈలా దేవుని ఆత్మ మన హృదయాన్ని తాకి అది శత్రువుని మన్నించేలా చేస్తుంది.

  మనం శత్రువు కొరకు గూడ ప్రార్థించాలి. దేవుని జాలిని అర్థంజేసికొని విరోధి కొరకు జపించాలి. ప్రేమ పాపంకంటె గూడ బలమైంది. తోడినరులను ప్రేమించేవాడు వారి తప్పిదాలను క్షమిస్తాడు. వేదసాక్షులు, పునీతులు ఈలా చేసారు. ఒకరినొకరం క్షమిస్తేనేగాని తండ్రియైన దేవునితోను, ఇరుగు పొరుగువారితోను రాజీపడలేం.
    క్షమాపణం ద్వారా తోడివారితో రాజీపడతాం. వారిపట్ల సమాధానాన్ని పెంపొందించుకొంటాం. సిప్రియను భక్తుడు వాకొన్నట్లుగా, విభజనలను తెచ్చిపెట్టేవాడి బలిని దేవుడు అంగీకరించడు. అతన్ని తన బలిపీఠం చెంతనుండి వెళ్ళిపొమ్మని ఆజ్ఞాపిస్తాడు. దేవుణ్ణి శాంతింపజేసేది సమాధాన క్రియ, శాంతి, ఐక్యత, ప్రేమ దేవునికి ప్రీతి కలిగించే బలులు.

6. మమ్మ శోధనలో చిక్కుకోనీయకు

         ముందటి విన్నపంలో దేవుణ్ణి మన తప్పిదాలను మన్నించమని అడుగుకొన్నాం, కాని మన తప్పిదాలు మన శోధనలనుండే వస్తాయి. కనుక ఇక్కడ మమ్మ శోధనలో చిక్కుకోనీయకు అని అడుగుకొంటున్నాం. ఈ సందర్భంలో "మమ్మ శోధనలో చిక్కుకోనీయకు" ෂරහී మమ్మ శోధనలకు లొంగనీయకు అని భావం. అనగా మమ్మ పాపంలో పడనీయకు అని అర్థం. ఏ దుష్టశక్తి దేవుణ్ణి శోధించలేదు. అతడు ఎవరినీ శోధించడు - యాకో 1.13. కనుక దేవుడు మనం పాపంలో పడాలని కోరడు. పాపంనుండి బయటపడాలని కోరుతాడు. కావున ఇక్కడ మనం అతన్ని మమ్మలను పాపపు త్రోవలోపోనీయవద్దని వేడుకొంటున్నాం. ఈ లోకంలో మనం శరీరానికి ఆత్మకు జరిగే యుద్ధంలో పాల్గొంటున్నాం. ఈ యుద్ధంలో దేవుని ఆత్మ మనకు వివేకాన్ని దయచేయాలని ఈ విన్నపంలో వేడుకొంటున్నాం.