పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 277 P.pdf/90

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

లేకపోవచ్చుగూడ.కనుక మనలను రక్షించేదీ, మనలను భగవంతునిలాంటి వాళ్లను చేసేదీ ప్రేమ ఒక్కటే. అనగా తోడిమానవుణ్ణి ఆదరించేవాడే నరుడు. వాడే భగవంతుణ్ణి పొందేవాడు. తోడిమానవుణ్ణి ఆదరించనివాడు రాక్షసుడు. వాడు పిశాచాన్ని పొందుతాడు.

  ప్రపంచ జనాభాలో నాల్గవవంతు మాత్రమే ఐన ధనికజాతులు ప్రపంచంలో ఉత్పత్తి అయ్యే సంపదలో 87 శాతం కొట్టేస్తున్నారు.ప్రపంచ జనాభాలో మూడువంతులు ఐన పేద జాతులు మిగతా 18 శాతం మాత్రమే పొందగల్లుతున్నారు ధనిక జాతుల వాళ్ల ప్రపంచంలోని గొప్ప శాస్త్రపరిశోధనా కేంద్రాల్లో 98శాతం నడిపిస్తున్నారు. పేదజాతులవాళ్లు మిగతా 2శాతం కేంద్రాలను మాత్రమే నడిపిస్తున్నారు. ఈ పరిశోధనా కేంద్రాలు కనుగొనే నూత్న సూత్రాలవల్ల ధనికజాతులే లాభం పొందుతున్నారు. ప్రపంచ వ్యాపారంలోను పెట్టుబడిలోను 80శాతం ధనికజాతుల ఆధీనంలో వున్నాయి. 20 శాతం పేదజాతుల ఆధీనంలో ఉన్నాయి. ధనికజాతులు వాళ్లరాజ్యాంగ సూత్రాలనూ వాళ్ల భావాలనూ పేదజాతుల విూద రుద్దుతుంటారు. పేదజాతులు విద్యావిధానమూ రాజకీయ విధానమూధనికజాతులను అనుకరిస్తుంటాయి. ఈ విధంగా ప్రపంచంలోని ధనికజాతులు పేదజాతులను బానిసలుగా జేసికొని ఏలుతుంటారు.

30.సోదరప్రేమ జీవమూ, సోదర ద్వేషం మరణమూ - 1యోహా 8,14

   సోదరప్రజను ప్రేమించేవాడు జీవాన్ని అలా ప్రేమించనివాడు మృత్యువనీ పొందుతాడు. సోదరప్రేమ వెలుగు, అది లేకపోవడం చీకటి. సోదరప్రేమగల మానవులు దేవుని బిడ్డలు, అదిలేనివాళ్లు పిశాచం బిడ్డలు. సోదరప్రేమను పాటించడమనగా సత్యాన్ని పల్మడం, దాన్నిపాటించకపోవడమనగా అబద్దమాడడం. సోదరప్రేమను పాటించడమనగా దేవుణ్ణి తెలిసికోవడం, దాన్నిపాటించకపోవడమనగా దేవుణ్ణి తెలిసికోలేకపోవడం,ఇవన్నీ యోహాను తొలిజాబులోని భావాలు. ఈ భావాలను బట్టి సోదరప్రేమ ఎంత విలువైందో విశదమూతూంది గదా!
   ప్రపంచంలో నాల్గవ వంతు ధనిక జాతులూ, మూడువంతులు పేదజాతులూ అన్నాం. అంతర్జాతీయ సూత్రాలను అమలుపరచేవాళ్ళు ధనిక జతులే. పేదజాతులు ధనిక జాతులు విధించే రాజ్యాంగ సూత్రాలకు కట్టుపడివుండాలి. అంతర్జాతీయ సంస్థలన్నీ ధనిక జాతుల చేతుల్లోనే వున్నాయి. ఈ సంస్థల్లో పేద జాతులకు అట్టే ప్రాబల్యం లేదు. అంతర్జాతీయ న్యాయస్థానాలుకూడ ధనిక జాతుల అధీనంలో వున్నాయి. కనుక పేద జాతులకు అట్టే న్యాయం జరగడం లేదు. అంతర్జాతీయ ఆర్థిక వ్యవహారాలూ వర్తకమూ ధనిక జాతుల వశంలో వున్నాయి. పేదజాతులు తమలోతాము పోట్లాడుకొంటూ వుంటారు, అంతే ఈ విధంగా ఒక్కమనదేశంలోనేకాదు, ప్రపంచంలోకూడ ధనవంతుడు పేదవాణ్ణి ఏలుతున్నాడు. ఉన్నవాడు లేనివాని రొమ్ము విూద కాలు మోపి వాణ్ణి లేవనీకుండా