పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 277 P.pdf/89

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రూపాయి కొనుగోలు విలువ 26 పైసలు మాత్రమే. ఇప్పడు 15 పైసలు. పేదవాడు రూపాయి తీసుకొని అంగడికి వెత్తే వాడికి ఇప్పడు 15 పైసలు విలువగల వస్తువులు మాత్రమే లభిస్తాయి, వాడిజేబులో ఎన్ని రూపాయలుంటాయి? వాని చేతిలోనికి ఎన్ని వస్తువులు వస్తాయి? వాడి యింటిలో జనమెంతమంది? వాడి కుటుంబం బ్రతికేదెలా? పేదవాడి బాధలు ధనవంతులకేలా అర్థమౌతాయి?

28. భగవంతుడు ప్రేమమయుడు - Lయో 48

.

భగవంతుని గుణాలన్నిటిలోను ముఖ్యమైంది ప్రేమ. అతడు ప్రప్రధానంగా ప్రేమమయుడు. ఇక, ఈ భగవంతుడు నరుడ్డి తనకు పోలికగా కలిగించాడు. కనుక భగవంతుని గుణాలే నరునిలోను వుండాలి. అనగా నరుడుకూడ ఆ భగవంతునిలాగే ప్రేమమయుడై యుండాలి. అందుకే భగవంతుడు పరిశుద్దాత్మ ద్వారా తన ప్రేమను మన హృదయాల్లో కుమ్మరిస్తుంటాడు - రోమా 5,5, ఈ దివ్యాత్మ ద్వారా భగవంతునిలో వుండే ప్రేమే మనలోనూ వేరు పాతుకొంటుంది. ఆ ప్రభువులాగే మనమూ ప్రేమ జీవితం జీవిస్తాం, ఆ భగవంతునిలాగే మనమూ ప్రప్రధానంగా ప్రేమ మూర్తుల మౌతాం. కాని స్వార్ధం వల్ల నరుడు తనలోని యీ ప్రేమశక్తిని చంపివేస్తుంటాడు. తోడి మానవులను ప్రేమించడానికి మారుగా వాళ్లను ద్వేషిస్తుంటాడు. విూదటి అంశాల్లో మనదేశంలో కన్పించే సాంఘిక అన్యాయాలను పరిశీలించాం. ప్రపంచంలోని వివిధ జాతుల్లోగూడ చాల అన్యాయం వుంది. జాతీయరంగంలో కంటే అంతర్జాతీయ రంగంలో సాంఘిక అన్యాయం ఎక్కువ. ప్రపంచ జనాభా వేయి కోట్ల ఈ జనాభాలో ధనిక జాతులు నాల్గవ వంతు మాత్రమే. పేదజాతులు మూడు పాళ్లు, కాని 25 శాతం మాత్రమే ఐన ధనిక జాతులు ప్రపంచ సంపదలో 85 శాతం అనుభవిస్తున్నారు. 75 శాతమైన పేదజాతులు ప్రపంచ సంపదలో 15 శాతంమాత్రమే అనుభవిస్తున్నారు. అదేమంటే ధనిక జాతులు పేదజాతులను సంతాన నిరోధాన్ని పాటించమని సలహాయిస్తున్నారు. కాని పేదజాతులు సంతాన నిరోధాన్ని పాటించడంకాదు పరిష్కార మార్గం. మరి ధనిక జాతులు అక్రమంగా స్వాధీనం చేసికొన్నప్రపంచ సంపదను పేద జాతులకు పంచియిూయడం.

29. ప్రేమలేనివాడనైతే అంతా వ్యర్ధమే - 1కొ 13,2

పౌలు కొరింతీయులకు వ్రాస్తు మనుష్యుల భాషలోను దేవదూతల భాషలోను మాటలాడే వక్తృత్వశక్తి కన్న ప్రవచనము జ్ఞానము విశ్వాసము మొదలైన దివ్యశక్తులకన్నా ఆస్తిపాస్తులను పేదసాదలకు పంచియిూయడమనే దానశక్తికన్న సోదరప్రేమ గొప్పశక్తి అన్నాడు. ఆ శక్తులన్నీ వున్నా ప్రేమశక్తి లేకపోవచ్చు. ప్రేమశక్తి ఒక్కటుండి ఆ శక్తులన్నీ