పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 277 P.pdf/36

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

“మనకో శిశువు జన్మించాడు ఓ కుమారుడు లభించాడు అతడు మనకు పాలకుడౌతాడు అతనికి ఆశ్చర్యకరుడైన హితోపదేశకుడు, మహాదేవుడు, శాశ్వతపిత, శాంతిదూత అని పేర్లు అతని రాజ్యాధికారం పెంపజెందుతుoది అతని రాజ్యంలో ఎప్పడూ శాంతి నెలకొంటుంది దావీదు అనుయూయిగా అతడు కలకాలం రాజ్యం చేస్తాడు" అని చెప్పాడు - 9,6-7, ఈ రెండు ప్రవచనాలూ రాబోయే క్రీస్తుకి వర్తిస్తాయి.

2. నూత్నవేదమూ బాలలూ

ప్రవక్త మెస్సీయా పుట్టవును వర్ణించాడని చెప్పాం గదా! ఆ మెస్సీయా శిశువు మనకోసం బేత్లెహేములో జన్మించనే జన్మించాడు. ఆ బాబుని పొత్తిగుడ్డల్లో చుట్టి పసుల తొట్టిలో పరుండబెట్టింది తల్లి మరియ- లూకా 2,12. శిశువుగా వున్నపుడే ఆతల్లి అతన్నిదేవాలయంలో అర్పించింది - 2,27. బాలుడుగా అతడు తల్లిదండ్రులైన మరియా యోసేపలకు విధేయుడయ్యాడ~_2,51, అతడు పరలోకంలోని తండ్రి కార్యంలో నిమగ్నుడై వుండేవాడు కూడ - 2,49, ఈ రీతిగా యేసు తాను శిశువుగా పుట్టి మన శిశువులందరినీ దీవించాడు. తాను బాలుడుగా పెరిగి మన బాలలందరినీ ఆశీర్వదించాడు.

ఈ యేసు పెరిగి పెద్దవాడైన పిదప బాలలకు అంతకుముందు యూదు సంప్రదాయంలో లేని గౌరవాన్ని చేకూర్చిపెట్టాడు. బాలలను గూడ వ్యక్తులనుగా గుర్తించి గౌరవంతో చూచిన మొదటి రబ్బయి అతడే. ఆ వివరాలను కొన్నిటిని పరిశీలిద్దాం.

1. క్రీస్తు చిన్నబిడ్డలను ఆహ్వానించాడు

యూదులు చిన్నబిడ్డలనూ స్త్రీలనూ పెద్దగా గౌరవించలేదని చెప్పాలి. ఐనా క్రీస్తు పసివాళ్ళను గూడ పూర్ణవ్యక్తులనుగా గుర్తించి ఆదరించాడని గూడ నుడివాం. ఓమారు కొందరు తల్లలు చిన్నబిడ్డలనెత్తుకొని ప్రభువు దగ్గరకి వచ్చారు. ఆ పుణ్యపురుషుడు దీవిస్తే తమ బిడ్డలు తప్పకుండా వృద్ధిలోకి వస్తారని వాళ్ళ భావం. కాని శిష్యులు ఆ తల్లలను క్రీస్తు చెంతకు రానీకుండా ఆటంకపరచారు. అప్పడు ప్రభువు శిష్యులను మందలించి ఆ తల్లలను దగ్గరికి పిల్చాడు. పిల్లల విూద చేతులు చాచి వాళ్ళను దీవించాడు. ఈలా అతడు చిన్నబిడ్డలను ఆహ్వానించి ఆదరించాడు - మార్కు 10, 13-16.