పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 277 P.pdf/35

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నిద్ర పోతూండగా ప్రభువు అతనికి ప్రత్యక్షమై పేరెత్తి పిల్చాడు. ఈలా మూడుసార్లు జరిగింది. నాల్గవసారి దేవుడు పిలవగా సమూవేలు "ప్రభూ! ఆజ్ఞ యీయి. నీ దాసుడు ఆలిస్తూనే వున్నాడు" అన్నాడు. అప్పడు ప్రభువు ఆ బాలునికి తన సందేశం విన్పించాడు. ఆనాటి నుండి సమూవేలు ప్రభువు ప్రవక్త అయ్యాడు. యిస్రాయేలీయులకు దైవ సందేశాన్ని విన్పించాడు. వాళ్లకు న్యాయాధిపతిగా నాయకుడుగా వ్యవహరించాడు -1సమూ 3.

ప్రవక్తమైన సమూవేలు యీషాయి కొడుకుల్లో ఒకనిని సౌలు స్థానే రాజుగా అభిషేకించడానికి బేత్తెహిముకు వచ్చాడు. అతడు యీషాయి కొడుకుల్లో మొదటి యేడ్లరునీ త్రోసిపుచ్చి కడగొట్టవాడైన దావీదును పిలిపించాడు. అప్పడు దావీదు ఇంటివద్ద లేడు, పొలంలో గొర్రెలు మేపుతున్నాడు. తండ్రి అతన్ని రప్పించాడు. ఆ బాలుడు రాగానే ప్రభువు నేను కోరుకున్నవాడితడే, నీవు ఇతన్ని అభిషేకించు అని ప్రవక్తతో చెప్పాడు, ప్రవక్త తైలపుకొమ్మ పుచ్చుకొని అన్నలందరి యెదుట దావీదుకు అభిషేకం చేసాడు. ఆ దినం మొదలుకొని ప్రభువు ఆత్మ దావీదును ఆవేశించి అతనిలో వుండిపోయింది - 1సమూ 16,11-12. ఈ దావీదు యిస్రాయేలు గోత్రాలన్నిటిని ఐక్యపరచాడు. యూద సామ్రాజ్యాన్ని నిర్మించాడు. సమూవేలు ప్రవక్తగా యిప్రాయేలుకు రక్షకుడైతే ఇతడు రాజుగా రక్షకుడయ్యాడు.

యూదులు బాబిలోనులో ప్రవాసులుగా వున్నకాలంలో సూసన్న అనే గృహిణి వుండేది. ఆమె యొవాకిం భార్య, అందగత్తె, ఒకయేడు ఇరువురు వృదులు యూదులకు న్యాయాధిపతులుగా ఎన్నికయ్యారు. వీళ్ళ సూసన్న అందాన్ని చూచి ఆమెను కామించారు. కాని ఆమె వాళ్ళ కోరికను నిరాకరించింది అందువల్ల వాళ్ళు ఆగ్రహం చెంది సూసన్న మరెవరితోనో వ్యభిచరించింది అని నేరం మోపి ఆమెకు మరణశిక్ష విధించారు. అలా ఆ పుణ్యాత్మురాలుని చంపడానికి తీసికొని వెళూండగా ప్రభువు ఆత్మ దానియేలు అనే బాలుణ్ణి ప్రేరేపించింది. అతడు జనాన్నందరినీ మళ్లా న్యాయస్థానానికి మరలించుకొని వచ్చాడు. అక్కడ దానియేలు ఆ వృద్ధ న్యాయాధిపతులిరువురిని వేరువేరుగా పిల్చి సూసన్న ఎక్కడ వ్యభిచరించిందో చెప్పమన్నాడు. వాళ్ళిద్దరూ పరస్పర భిన్నమైన తావులు పేర్కొన్నారు. కనుక పాళ్ళ దొంగ సాక్షులని తేలిపోయింది. కడన వాళ్ళకు మరణశిక్ష ప్రాప్తించింది, సూసన్న బ్రతికి బయటపడింది. ఈలా ఈ బాలుడు ఈ పుణ్యస్త్రీకి రక్షకుడయ్యాడు - దాని 13, 44-50.

పూర్వవేదంలో యెషయా ప్రవక్త మెస్సీయా శిశువు పుట్టవును వర్ణించాడు. "గర్భవతిగా వున్న ఓ యువతి కుమారుని కని ఆ శిశువుకి ఇమ్మానువేలు అని పేరు పెడుతుంది" అని ప్రవచించాడు -7, 14. ఇంకా ఈ శిశువును గూర్చిన వివరాలను పేర్కొంటూ.