పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 277 P.pdf/37

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

2. చిన్నబిడ్డలకు ఉపకారం చేసాడు

ప్రభువు చిన్నబిడ్డలకు ఉపకారం చేసిన సందర్భాలు కూడ కొన్ని వున్నాయి. కననీయ స్త్రీ తన బిడ్డను పట్టిపీడించే దయ్యాన్ని పారద్రోలమని ప్రాధేయపడింది. ప్రభువు పిల్లలు తినవలసిన రొట్టెను కుక్క పిల్లలకు వేయం గదా అన్నాడు. కాని ఆమె పిల్లలు భోజనపు బల్ల విూదనుండి జారవిడిచిన రొట్టె ముక్కలను కుక్కపిల్లలు కూడ తిని బ్రతుకుతాయి కదా అంది. ఆమె విశ్వాసాన్ని మెచ్చుకొని ప్రభువు ఆమె పాపకు పట్టివున్న దయ్యాన్ని వెళ్ళగొట్టాడు - మార్కు7,24-80. ఇంకా అతడు చనిపోయిన యాయిూరు కొమార్తెను జీవంతో లేపాడు. ఆమె పండ్రేండేళ్ళ బాలిక - మార్కు 5,41-42. ఇవి రెండు అతడు చిన్నపిల్లలకు చేసిన ఉపకారాలు.

అసలు పిల్లలంటే ప్రభువుకి యెంతో యిష్టం. కనుకనే అతని బోధల్లో పిల్లలను సమర్ధించే వాక్యాలు కూడ వున్నాయి. పెద్దవాళ్ళ බීඝ්‍රචණ්හා అపమార్గం పట్టించగూడదు. అలాంటి పని చేయడం కంటె మెడలో తిరుగలిరాయి కట్టుకొని సముద్రంలో పడిపోవడం మేలు - మత్త 18,6. ఇంకా, పెద్దవాళ్ళ పిల్లలను చిన్నచూపు చూడకూడదు. అలా చూస్తే ఆ బిడ్డలకు కావలి కాసే దేవదూతలు ఆ యన్యాయాన్నిదేవుని సన్నిధిలో విన్నవిస్తారు - మత్త 18,10. కనుక పెద్దవాళ్ళ పిల్లలకు కీడు చేయకూడదని భావం.

3. చిన్నబిడ్డలు శిష్యుల్లాంటి వాళ్ళ

క్రీస్తు మోక్షాన్ని దైవరాజ్యమని పేర్కొంటూండేవాడు. శిష్యులు ఆ రాజ్యం కూడ ఈ భూలోక రాజ్యం లాంటిదే అనుకొన్నారు. ఆ రాజ్యంలో తాము మంత్రులం కావచ్చు అని కూడ భావించారు, కాని యెవరు ప్రధానమంత్రి కావాలి అన్న పేచీ వచ్చింది. కనుక వాళ్ళ క్రీస్తు దగ్గరికి వచ్చి నీవు బోధించే ఆ పరలోక రాజ్యంలో అందరికంటె గొప్పవాడెవడు అని అడిగారు. అనగా నీరాజ్యంలో ఎవరు ప్రధానమంత్రి ఔతారు అని వాళ్ల ప్రశ్న క్రీస్తుకి ఈ మనస్తత్వం ఏమిూ నచ్చలేదు. అతడు శిష్యులను మందలించి వాళ్ళను చిన్నబిడ్డల్లా తయారుకమ్మన్నాడు. చిన్నబిడ్డల్లా ఐతేనేగాని వాళ్లు పరలోక రాజ్యంలో ప్రవేశించరని నొక్కి చెప్పాడు - మత్త 18,1-5, కాని యిక్కడ శిష్యులు చిన్నబిడ్డల్లా తయారు కావాలంటే భావం ఏమిటి? వాళ్లు ప్రాయంలో చిన్నవాళ్ళు కాలేరు. మరి దేనిలో చిన్నవాళ్ళ కావాలి? చిన్నబిడ్డడు పెద్దవాళ్ళ విూద ఆధారపడి జీవిస్తాడు. అలాగే శిష్యులు కూడా దేవునిమిద ఆధారపడి జీవించడం నేర్చుకోవాలి. నేను అంతటి వాణ్ణి యింతటివాణ్ణి అనే భావం కొని, నాకునేను చాలుదుననే ధీమాగాని వాళ్ళకు పనికిరాదు. వాళ్ళ దేవునిమిూద ఆధారపడాలి. ఆ తండ్రిని నమ్మడం నేర్చుకోవాలి. అతనిపట్ల వినయ