పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 277 P.pdf/264

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

15.ఎవడైనాసరే ధనికుడైయుండిగూడ అక్కరలోవున్న తన సోదరుని గాంచి కనికరం జూపకపోతే, ఇక అతని హృదయంలో దైవప్రేమ వుందని యేలా చెప్పగలం? - 1 యోహా 8,17.

18. ప్రభువు పితృతుల్యడు

యిప్రాయేలు ప్రజలూ క్రైస్తవ ప్రజలూ భగవంతుణ్ణి తండ్రిగా భావిస్తూ వచ్చారు. ఇది బైబులు మతానికి ప్రత్యేకం. ఆ ప్రభువుకి వర్తించే గుణాలన్నిటిల్లోను శ్రేష్టమైన గుణం పితృభావం. క్రీస్తు ద్వారా మనం పరలోకంలోని తండ్రికి బిడ్డలమౌతాం. అతని ద్వారానే ఆ తండ్రి దీవెనలు పొందుతాం.

1.యిప్రాయేలు నా కుమారుడు, నాకు మొదట పట్టినవాడు. నన్నారాధించుటకు నా కుమారుని వెళ్ళనీయి. కాని అతన్ని పంపడానికి నీవంగీకరించడంలేదు. కావున నేను నీకు మొదట పట్టిన కుమారుణ్ణి చంపివేస్తాను - నిర్గ 4, 22-23

2.యిస్రాయేలు బాలుడై యుండగా నేనతన్ని ప్రేమించాను. ఐగుపునుండి నా కుమారుడ్డి పిలిపించాను - హోపేయ 11.1

3.ప్రభూ! నీవే మాతండ్రివి. మా పితరులైన అబ్రాహాము యాకోబు మమ్మ అంగీకరింపకపోయినా నీవే మా తండ్రివి. పరాతన కాలంనుండీ మమ్మల్నిరక్షిస్తూ వచ్చినవాడవు నీవే - యొష 63,16

4.ప్రభో! నీవే మా తండ్రివి. కుమ్మరి బంకమట్టితో కుండను చేసినట్లుగా నీవుమమ్మ చేసావు. మా మీద కోపించబోకు. మా పాపాలను గణించబోకు, మేము నీ ప్రజలంగనుక మా మీద కరుణజూప - యెష 64, 8-9

5.మా అమ్మా నాన్నా నన్ను విడనాడినా
ప్రభువు మాత్రం నాకు ఆశ్రయమిస్తాడు - కీర్త 37, 10

6.నాయనా! యావే శిక్షను తృణీకరించవద్దు
అతని మందలింపులకు విసుగు జెందవద్దు
తండ్రి తన కిష్టమైన కుమారుడ్డి సవరించినట్లే
ప్రభువు తన కిష్ణులైనవాళ్ళను సరిదిద్దుతాడు - సామె 3,11-12

7.నీతిమంతుడు దేవుని కుమారుడైతే దేవుడతనికి సాయపడతాడు
శత్రువుల బారినుండి అతన్ని కాపాడతాడు - జ్ఞాన 2,18

8.పరలోకంలోని తండ్రికి మీ యవసరాలన్నీ తెలుసు - మత్త 6,32 257