పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 277 P.pdf/263

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

9.ప్రభు! నీలాoటీ దేవుడు లేడు
నీవు ప్రజల పాపాలు మన్నిస్తావు
నీ కోపం దీర్ఘకాలం నిలవదు
నీ కరుణను ప్రదర్శించడం నీ కానందం
మరల వొకసారి నీవు మామీద కరుణజూప
మా యపరాధాలను నీ కాళ్ళక్రింద త్రోక్కివేయి
మా పాపాలను సముద్రగర్భంలోనికి విసరివేయి - మీకా 7, 18-19

10.ప్రభువుకి నీ పాపాలు తెలుసు
నీ వితరులమీద పగతీర్చుకొంటే
ప్రభువు నీ మీద పగతీర్చుకొంటాడు
కాని నీకు అపరాధం చేసినవాణ్ణి నీవు మన్నిస్తే
నీవు ప్రార్థన చేసినపుడు దేవుడు నీ తప్పలు మన్నిస్తాడు
నీ వితరులమీద కోపతాపాలు చూపుతూ
నిన్ను కరుణించమని ప్రభువుని ఎలా అడుగుకొంటావు?
నీ మట్టకు నీవు పాపివి
ఐనా నీ వితరుల పాపాలు మన్నించడంలేదు
మరి దేవుడు నీ తప్పలను మన్నించాలని ఎలా అడుగుకొంటావు?
నరమాత్రుడవైన నీవు నీ కోపాన్ని అణచుకోలేకపోతే
నీ దోషాల నెవరు మన్నిస్తారు? - సీరా 28, 2-5

11.యేసు పడవదిగి జనసమూహాన్ని చూచాడు. కాపరిలేని గొర్రెల మందలావున్న ప్రజలపై కనికరం గలిగి వారికి అనేక విషయాలను బోధింపసాగాడు - మార్కు 6, 34

12."నాకు కారుణ్యం కావాలికాని బలి అక్కరలేదు" అనే వేదవాక్యం భావం మీరు అర్థం చేసికొనండి. నేను వచ్చింది పాపులను పిలవడానికిగాని నీతిమంతులను పిలవడానికి కాదు - మత్త 9, 13. హోషే 6,6

13.ప్రజల పాపాల పరిహారార్ధం భగవత్సేవలో విశ్వసనీయుడును దయామయుడనైన ప్రధాన యాజకుడు కావడానిగాను, అతడు సర్వవిధాల తన సోదరులను పోలినవాడు కావలసివచ్చింది - హెబ్రే 3,17

14.నా సోదరుల్లో అత్యల్పడైన ఏ వొక్కనికైనా మీరు ఇవి చేసినపుడు వీటిని నాకు చేసినట్లే - మత్త 25, 40