పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 277 P.pdf/265

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

9. మీరెంత చెడ్డవాళ్ల్తెనా మీ బిడ్డలకు మేలి వస్తువుల నీయాలని మీకు తెలుసుగదా! పరలోకంలోని మీ తండ్రి తన్నడిగిన వాళ్ళకు ఇంకా యెంతటి మేలివస్తువుల నిస్తాడో ఊహించండి - మత్త 7,11

10. ఆకాశంలో తిరిగే పక్షులను చూడండి. అవి విత్తనాలు నాటవు. నూర్పిళ్ళు చేయవు. గాదెల్లో ధాన్యం నిల్వజేసికోవు. ఐనా పరలోకంలోని మీ పిత వాటిని పోషిస్తున్నాడు. ఆ పక్షులకంటె మీరు విలువైనవాళ్ళు కాదా? - మత్త 6, 26

11. ఈనాడుండి రేపు పోయ్యిలో కాలిపోయే గడ్డిపోచనే దేవుడు అలా పూలనే వస్తాలతో అలంకరిస్తుంటే, అంతకంటె అధికంగా ఆయన మీకు బట్టలీయడా! = మత్త 6, 30

-12. పరలోకంలోని మీ తండ్రిలాగే మీరూ పరిపూర్ణులై యుండండి - మత్త 5, 48 మీ తండ్రిలాగే మీరూ కనికరం గలవారై యుండండి — లూకా 6, 36

13. తండ్రి నా యందూ నేను తండ్రియందూ నెలకొని వున్నామని గ్రహించండి - యోహా 10,38

14. నన్ను పంపిన తండ్రి ఆకర్షిస్తేనే తప్ప ఎవడూ నా వద్దకు రాలేడు - యోహా 6,44

- నామూలాన తప్ప ఎవడూ తండ్రివద్దకు రాలేడు - 14,6

15. క్రీస్తుని అంగీకరించి విశ్వసించినవాళ్ళందరికీ అతడు దేవుని బిడ్డలయ్యే భాగ్యం ఇచ్చాడు - యోహా 1, 12

-యేసు క్రీస్తుని విశ్వసించడం వలన మీరందరూ దేవుని కుమారులౌతున్నారు - గల 3.26

16. తండ్రీ అని మొరపెట్టే తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయాల్లోనికి పంపాడు - గల 4,6


17. మనం దేవుని బిడ్డలమని పిలువబడుతున్నాం అంటే దేవుడు మనల నెంతగా ప్రేమించాడో ఆలోచించండి. ఔను, మనం నిజంగా దేవుని బిడ్డలమే - 1 యోహా 3,1.