పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 277 P.pdf/260

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సమయం వచ్చింది, కాని పాతాళంలో ప్రభువు నెవరూ స్తుతించరు. కనుక తన్ను భూమి మీదనే నిలపమని కోరాడు. తానా ప్రభువు కరుణను స్తుతిస్తానని మాటయిచ్చాడు.

ప్రభువు దీర్ఘశాంతుడు, క్షణమాత్రకోపి. ఆయన తాను కలిగించిన ప్రతిప్రాణిపట్లా కనికరం జూపుతుంటాడు. పైగా మన పాపాలకు తగినట్లుగా మనలను శిక్షింపడు, అలా మనమంతా యిప్పటికల్లా ఎక్కడుండేవాళ్ళమో! భూమికి ఆకాశం ఎంత ఎత్తుగా వుంటుందో ఆయన ప్రేమగూడ అంత మిక్కుటంగా వుంటుంది. పడమర తూర్పునకు ఎంత దూరమో మన పాపాలనూ ఆయన అంతదూరంగా తొలగిస్తాడు. వేయేల? తండ్రి తన బిడ్డలమీద కరుణజూపినట్లే భగవంతుడూ తన భక్తులమీద జాలి జూపుతూంటాడు. అతనిది పితృహృదయం, మాతృహృదయం.

1. మా అమ్మా నాన్నా నన్ను గెంటివేసినా
ప్రభువు మాత్రం నన్ను ఆదరిస్తాడు - కీర్త 27, 10
2. నేను చనిపోతే నీకేమి లాభం?
నేను పాతాళం జేరుకొంటే నీకేమి ఫలితం?
అక్కడి మృతులు నిన్ను స్తుతిస్తారా?
నీ మంచితనాన్ని కొనియాడతారా? కనుక ప్రభో! నా మొర ఆలించు
కరుణతో నాకు తోడ్పడు - 30, 9-10
3. ప్రభువు కోపించేది ఓ క్షణకాలంమాత్రమే
ఆయన అనుగ్రహమేమో జీవితాంతమూ వుంటుంది – 30, 5
4. ప్రభువు ప్రేమహృదయుడు కరుణామయుడు
అతడు సులభంగా కోపపడేవాడు కాదు
అతడు ఎంతో మంచివాడు
తాను చేసిన ప్రతి ప్రాణినీ కనికరించేవాడు - 145, 8-9
5. ప్రభువు ప్రేమహృదయుడు, కరుణామయుడు
అతడు సులభంగా కోపపడేవాడు కాదు
అతడు నిత్యమూ మనలను చీవాట్లు పెట్టడు
అతని కోపం దీర్ఘకాల ముండేదికాదు
మన పాపాలకు తగినట్లుగా మనలను శిక్షింపడు
మన దోషాలకు తగినట్లుగా మనకు ప్రతిఫలమీయడు
భూమికి ఆకాశం ఎంత ఎత్తుగా వుంటుందో
ప్రభువుకి భయపడేవాళ్ళపట్ల