పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 277 P.pdf/259

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

19.ఎల్ల జాతులు చూస్తుండగా
ప్రభువు పవిత్రమైన తన బాహుశక్తిని ప్రదర్శిస్తాడు
ఈ భూలోకమంతా మన ప్రభువు రక్షణాన్ని చూస్తుంది - యెష 52,10
20.నీవు అతనికి యేసు అని పేరు పెట్టాలి. అతడు తన ప్రజలను వాళ్ళ పాపాలనుండి రక్షిస్తాడు - మత్త 1, 21
21.ప్రజలందరి యెదుట నీవు సిద్ధంచేసిన రక్షణాన్ని నేను కన్నులారా చూచాను - లూకా 2, 30
22.దేవుడు లోకాన్ని యెంతో ప్రేమించి తన యేకైక కుమారుడ్డి ప్రసాదించాడు. ఆ కుమారుడ్డి విశ్వసించిన ప్రతివాడు నాశం చెందక నిత్యజీవం పొందుతాడు. దేవుడు తన కుమారుడ్డి పంపింది లోకాన్ని రక్షించడానికిగాని ఖండించడానికిగాదు - యోహా 3, 16-17
23.మనుష్యకుమారుడు వచ్చింది తప్పిపోయినదాన్ని వెదకి రక్షించడానికే - లూకా 19,10
24.అతడు నలిగిపోయిన రెల్లకాడను త్రుంచివేయడు, కునికిపాట్లపడే దీపాన్ని ఆర్చివేయడు - మత్త 12.20
25.అతని వలన తప్ప మరి యెవరివలనా రక్షణం కలుగదు. ఈ నామం మీదిగానే మనం రక్షణం పొందాలి. ఆకాశం క్రింద మనుష్య లోకంలో ఈయబడిన మరి యే నామం మీదిగాను మనకు రక్షణం లేదు - అచ 4, 12
26.అప్పుడు ప్రభువు నామం మీదిగా ప్రార్ధనచేసే వాళ్ళంతా రక్షణం పొందుతారు - అచ 2,21
27.నీవు ప్రభువైన యేసుని విశ్వసించు. అప్పడు నీవూ నీ కుటుంబమూ రక్షణం.
పొందుతారు - అకా 16,31
28.మానవులందరూ రక్షణం పొందాలనే దేవుని కోరిక - 1తిమొ 2,4
29.అతడు తనకు విధేయులైనవారి కందరికీ నిత్యరక్షణ కారకుడయ్యాడు - హెబ్రే 5,9
30.ఇదిగో యిప్పడే మిక్కిలి అనుకూలమైన సమయం, ఇదే రక్షణాదినం - 2కొరి 6,24

17. ప్రభువు కరుణామయుడు

బైబులు భగవంతుని ప్రధాన లక్షణాల్లో కనికరంగూడ ఒకటి. అతడు కరుణామయుడు. ఓ తండ్రిలాగ, ఓ తల్లిలాగ తన ప్రజలను ఆదరించేవాడు. భక్తుణ్ణి సొంత తల్లిదండ్రులే యింటిలోనుండి గెంటివేసినా ప్రభువుమాత్రం అతన్ని ఆదరిస్తాడు. తన దేవళంలో చేర్చుకొంటాడు. మరో భక్తుడు చనిపోయి పాతాళలోకం చేరుకోవలసిన