పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 277 P.pdf/261

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఆయన ప్రేమ అంత మిక్కుటంగా వుంటుంది
పడమరకు తూర్పు ఎంత దూరమో
మన పాపాలను ఆయన అంత దూరంగా తొలగిస్తాడు
తండ్రి తన కుమారులమీద కరుణ జూపినట్లే
ప్రభువు తనకు భయపడేవాళ్ళమీద జాలి జూపుతాడు
మన మేలాంటివాళ్ళమో అతనికి తేలియకపోదు
పిడికెడు మట్టినుండి పట్టినవాళ్ళమని అతడు గ్రహింపకపోడు - 103, 8-14
6.యావే యిస్రాయేలీయులమీద న్యాయాధిపతులను నియమించినపుడెల్లా తాను ఆ న్యాయాధిపతికి తోడుగా వుండేవాడు. అతడు జీవించినంత కాలమూ ప్రజలను శత్రువులనుండి కాపాడేవాడు. శత్రువుల దెబ్బకు తట్టుకోలేక ప్రజలు మొర్రపెట్టగానే యావే వారిని కరుణించేవాడు. కాని ఆ న్యాయాధిపతి చనిపోగానే ప్రజలు మళ్ళా దుష్టకార్యాలకు పూనుకొనేవాళ్ళ - న్యాయాధి 2, 18-19
7.దుర్మారుడు తన మార్గాన్ని విడనాడి
తన యాలోచనలను మార్చుకొనునుగాక
దుషుడు ప్రభువు వద్దకు మరలివస్తే
అతడు వానిని కరుణించి శీఘమే మన్నిస్తాడు - యెష 55,7
7A.ప్రభువు కాపరివలె తన మందలను మేపుతాడు
గొర్రెపిల్లలను చేతులలోనికి దీసికొని
రొమ్మమీద బెట్టుకొని మోసికొనిపోతాడు
వాని తల్లలను మెల్లగా అదిలిస్తాడు - యెష 40,11
7B.ప్రభువు ఈలా పల్కుతున్నాడు
నేను యెరూషలేంమీదికి
అభ్యుదయాన్ని నదివలె పారిస్తాను
జాతుల సంపదలను పొంగిపొరలే కాలువలాగా
ఆ నగరం మీదికి పారిస్తాను
యెరూషలేమనే తల్లి మీకు చంటిబిడ్డలకులాగే పాలిస్తుంది
మిమ్మ తన చేతులలోకి ఎత్తుకొంటుంది
తన యొడిలో కూర్చుండబెట్టుకొని లాలిస్తుంది
తల్లి కుమారునిలాగే నేను మిమ్మ ఓదారుస్తాను
యెరూషలేములో మిమ్మ ఓదారుస్తాను - యెష 66, 12-13