పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 277 P.pdf/258

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

5.భూమ్యాకాశాలను సృజించిన ప్రభువు నుండి
మాకు సహాయం లభిస్తుంది – 124, 8
6.ఈ పేద నరుడు మొర్రపెట్టగా ప్రభువు ఆలించాడు
సకలాపదల నుండీ ఇతన్ని కాపాడాడు - 34,6
7.నన్ను కంటిపాపను కాపాడినట్లుగా కాపాడు
నీ రెక్కల నీడలో నన్ను దాచి ఉంచుకో - 17,8
8.ప్రభువుపట్ల భయభక్తులను చూపేవాళ్ళను
ఆయన దూత కాపాడుతూంటాడు
సకలాపదలనుండి రక్షిస్తుంటాడు - 34, 7
9.ప్రభువే గనుక నన్ను ఆదుకోకపోయినట్లయితే, ఈపాటికెప్పడో మృతలోకం
జేరుకొని ఉండేవాణ్ణి - 94, 17
10.తప్పిపోయిన గొర్రెలాగ నేను త్రోవదప్పాను
ప్రభూ! ఈ నీ సేవకుణ్ణి వెదకడానికి రా
నేను నీ యాజ్ఞలను పాటించే భక్తుణ్ణి - 119, 176
11.నీ ముఖికాంతిని నా మీద ప్రకాశింపనీయి
నీ యాజ్ఞలను నాకు బోధించు - 119, 135
12.నీ జనమనే యీ పావురాన్ని డేగపాలు జేయకు
దీనులైన యీ నీ సేవకుల ప్రాణాలను మరచిపోకు - 74, 19
13.వేటగాని ఉరులలో జిక్కి తప్పించుకొన్న పక్షిలాగ
మేమూ ఆపదలనుండి తప్పించుకొన్నాం
ఉరులు తెగాయి, మేము తప్పించుకొన్నాం – 124, 7
14.నన్ను కరుణించు ప్రభో! నన్ను కరుణించు
అపాయాలన్నీ తొలగిపోయిందాకా నేను
నీ రెక్కల మరుగుననే దాగుకొంటాను - 57,1
15.నీవు ఇంటిలోనికి వచ్చినా బయటికి వెళ్ళినా ఇప్పడూ యెప్పడూ
ప్రభువు నిన్ను కాపాడుతూనే వుంటాడు - 121, 8
16.నేనతన్ని దీర్గాయువతో సంతృప్తి పరుస్తాను
అతడు నా రక్షణాన్ని చవిజూస్తాడు — 91, 16
17.యిస్రాయేలు ప్రజలకు కావలికాసే ప్రభువు
కునికిపాట్లు పడనూ పడడు, నిద్ర పోనూపోడు - 121,
4 నేనే ప్రభువుని
నేను తప్ప మరొక రక్షకుడు లేడు - యెష 48, 11