పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 277 P.pdf/240

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చరిత్రమున ప్రసిద్ది కెక్కిరి
ఒక వ్యక్తిని మరొక వ్యక్తి,
ఒక జాతిని వేరొక జాతీ,
పీడించే సాంఘిక ధర్మం
ఇంకనా? ఇకపై సాగదు. - శ్రీశ్రీ, మహా ప్రస్థానం.

8. పని



మనకు పని చేయాలంటే యిష్టంగా వుండదు. పనినుండి తప్పించుకొంటే ఎంతో గొప్ప అనుకొంటాం. కాని బైబులు భగవంతుడు స్వయంగా పనిచేసేవాడు. ఆ భగవంతునిలాగే అతని భక్తుడుకూడా పని చేయాలి. చివరికి మనలను రక్షించేదీ, శిక్షించేదీ కూడ మనంచేసే పనే.
1.దేవుడు తాను చేసిన సృష్టినంతటినీ చూచాడు. అతని కంటికది బాగా వుంది. అదే ఆరవరోజు. ఈ విధంగా భూమి ఆకాశం సమస్త వస్తువులతో సంపూర్ణంగా రూపొందాయి. ఏడవ రోజు దేవుడు తాను చేస్తూవున్న పనిని ముగించాడు. ఆ రోజు విశ్రాంతి తీసికొన్నాడు. ఏడవనాడు పనిని మానివేసాడు. కావున దేవుడు ఆ రోజును దీవించి పవిత్రదినంగా చేసాడు = ఆది 1,31–2,3
2.దేవుడైన యావే నరుని ఏదెను తోటలో వుంచాడు. ఆ తోటను సాగుచేయడం, కాపాడ్డం అతనిపని = ఆది 2, 15
3.నీవు మట్టిలో కలిసిపోయినదాక నీ నొసటి చెమటోడ్చి పొట్టకూడు సంపాదించుకొవాలి. నీవు మట్టినుండి పట్టావు, చివరకు మట్టిలోనే కలసిపోతావు - ఆది 3,19
4.సోలోమోను దేవాలయాన్ని కట్టడానికి ఏడేండ్లు పట్టింది - 1 రాజు 6, 38
<poem>5.సోమరీ చీమలను జూడు
వాటి జీవితాన్ని జూచి బుద్ధి తెచ్చుకో
వాటికి నాయకుడు లేడు,
పర్యవేక్షకుడు లేడు, అధికారి లేడు,
ఐనా అవి వేసవిలో ఆహారం చేకూర్చుకొంటాయి
కోతకాలంలో ధాన్యాన్ని సేకరించుకొంటాయి
సోమరీ! నీ వెంతకాలం పండుకొంటావు?
ఎప్పడు నిద్ర మేల్కొంటావు? - సామె 6, 6-9