పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 277 P.pdf/241

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

6.నేను ఐగుప్త దేశీయులు మీ నెత్తికెత్తిన బరువు తొలగిస్తాను. వారి దాస్యం నుండి మీకు విముక్తి కలిగిస్తాను. శక్తిగల నా చేతినిచాచి మీ శత్రువులను నిశితంగా శిక్షిస్తాను. మిమ్ము దాస్యంనుండి విడిపిస్తాను - నిర్గ 6,6 7.మనుష్యకుమారుడు సేవలు చేయించుకోవడానికి గాదు, సేవలు చేయడానికి వచ్చాడు. అతడు అనేకుల రక్షణార్థం తన ప్రాణాలను ధారపోయడానికి వచ్చాడు - మార్కు 10,45 8.నన్ను పంపినవాని చిత్తాన్ని నెరవేర్చడం, అతని పని పూర్తి చేయడం, నా కాహారం - యోహా 4,34. 9.అతడు మంచిపనులు చేస్తూ పర్యటించాడు - అ, చ. 10,38 10.మీ వెలుగుని ప్రజల యెదుట ప్రకాశించనీయండి. ప్రజలు మీ సత్కార్యాలను జూచి పరలోకంలోని మీ తండ్రిని కొనియాడతారు - మత్త 5,16 11.మీరు మీ బాధ్యతలను నిర్వహించిన పిమ్మటగూడ "మేము అయోగ్యులమైన సేవకులం. మా కర్తవ్యాన్ని మాత్రమే నెరవేర్చాం" అని పల్మండి - లూకా 17,10 12.మంచిచెట్టు మంచిపండ్లనూ చెడుచెట్టు చెడుపండ్లనూ కాస్తాయి. కావున నరుల ప్రవర్తననుబట్టి మీరు వారిని తెలిసికోవచ్చు - మత్త 7, 16-20 13.పని చేయనివాడు కూడు తినడానికి అరుడుకాడు -2తెస్చ 3,10 14.నేను మంచి పోరాటం పోరాడాను. నా పరుగు ముగించాను. విశ్వాసం నిలుపుకొన్నాను. ఇప్పడు నాకొరకు పందెపు బహుమానం వేచివుంది. స్యాయవంతుడూ న్యాయమూర్తీయైన ప్రభువు నాకు నీతిమంతుల కిరీటాన్ని బహూకరిస్తాడు. ఒక్క నాకేగాదు. తన దర్శనం కొరకు పేమతో వేచివుండేవాళ్ళందరికీ అతడు అలాంటి బహుమతినే అనుగ్రహిస్తాడు -2తిమె 4, 7-8 15.అనగనగ రాగ మతిశయిల్లచునుండు తినగ తినగ వేము తియ్యనుండు సాధనమున పనులు సమకూరు ధరలోన 16.ధనాని భూమౌ పశవశ్చగోష్టి నారీ గృహద్వారి జనాః శ్మశానే దేహశ్చితాయాం పరలోక మార్టే కర్మానుగో గచ్చతి జీవ ఏకః ||