పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 277 P.pdf/239

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

11.భగవంతుడు నరుడ్డి తనకు పోలికగా చేసాడు అని చెప్తారు. కాని నేడు అధిక సంఖ్యాకులైన నరులు నికృష్ణులు, దరిద్రులు, అజ్ఞానులు, భయకంపితులు, పీడితులు, దౌర్భాగ్యులు. ఐతే ఆ భగవంతుడు కూడ వీళ్ళలాంటి వాడేనని నమ్మడానికి నాకు మనసురావడం లేదు, మరి ఈ ప్రజలను ఈలా అభాగ్యులనుగా చేసిందెవరు? - జూలియస్ నైరెరె

12.నేను కొయ్యబొమ్మనూ రాతి విగ్రహాన్నీ కాదు
సశరీరుడనూ సజీవుడనూ ఐన దేవుణ్ణి
నేను నరుల నడుమ వసిస్తూన్నాను
ఐనా నరులు నన్ను గుర్తించడంలేదు
నేను మురికివాడల్లో క్షయతో మూల్లుతున్నాను
ఎండకూ వానకూ చలికీ బాధపడుతూన్నాను
ఆకలితో నా కడుపు నకనకలాడుతూంది
నేను ఉపాధ్యాయుణ్ణి విద్యార్థినీ కూడా
యజమానుద్దీ పనివార్టీ కూడా
పీడితుణ్ణి పీడకుజ్జీ కూడా, దరిద్రుడ్డీ ధనికుజ్జీ కూడా
అమెరికాలో, రష్యాలో, చైనాలో
వియత్నాంలో, కంపూచియాలో, ఇండియాలో వసించేది నేనే
నరులున్నకాడల్లా నేనూ వున్నాను
ఐనా నరులు నన్ను గుర్తించడం లేదు — ఓ అజ్ఞాత రచయిత
13.ఉర్వివారికెల్ల నొక్క కంచము పెట్టి
పొత్తు గుడిపి కులము పొలియజేసి
తలను చేయి పెట్టి తగనమ్మ జెప్పరా
విశ్వదాభిరామ వినుర వేమ.
14.ఏ దేశ చరిత్ర చూచినా
ఏమున్నది గర్వకారణం?
నరజాతి చరిత్ర సమస్తం
పరపీడన పరాయణత్వం
బలవంతులు దుర్భల జాతిని
బానిసలను కావించారు
నరహంతలు ధరాధిపతులై