పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 277 P.pdf/24

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

3. ఎవడైనా యిస్రాయేలు మతానికి వ్యతిరేకంగా ప్రవచనాలు చెప్పినట్లయితే, అతడు తన మాటలు నిరూపించుకొనడానికై అద్భుతాలు చేసి చూపించినా వాణ్ణి నమ్మకూడదు. ప్రజలను ప్రభువు మార్గం నుండి వైదొలగించి పెడత్రోవ పట్టింప గోరేవాడు కనుక ఆ కపట ప్రవక్తను పట్టి చంపాలి - ద్వితీ 13,1-5.

4. ప్రవక్తను నమ్మాలి అంటే అతని జీవితం విశుద్ధంగా వుండాలి. మంచి జీవితం జీవించే ప్రవక్త ప్రవచనం తప్పకుండా నిజమైయుండనక్కర లేదు. కాని చెడ్డ జీవితం జీవించే ప్రవక్త ప్రవచనం మాత్రం తప్పకుండా తప్పడిదే ఔతుంది. కనుక తననాటి మోసపు ప్రవక్తలను గూర్చి యిర్మీయా "సమరియా లోని ప్రవక్తలు బాలుదేవత పేర ప్రవచనాలు చెప్పి ప్రజలను అపమార్గం పట్టిస్తున్నారు. కాని యెరూషలేములోని ప్రవక్తలు ఇంకా ఫరోరకార్యాలు చేస్తున్నారు. వాళ్లు వ్యభిచరిస్తున్నారు, అబద్దాలు చెప్తున్నారు, ప్రజలను పరికొల్పి వాళ్లచేత దుష్కార్యాలు చేయిస్తున్నారు. సౌదొమ గొమర్రా పౌరుల వలె వీళ్లకూడదుపులైపోయారు" అన్నాడు - యిర్మి28, 13.14. ఈలాంటి దుర్మార్డులు చెప్పిన ప్రవచనం నిజం కానేరదు కదా! నూత్న వేదంలో ప్రభువు కూడ పండ్లను బట్టి చెట్టను నిర్ణయించాలి అన్నాడు - మత్త7,15-20. మామిడిపండ్లు కాస్తే అది మంచిచెట్ట. ఉమ్మెత్తకాయలు కాస్తే అది వెధవచెట్టు. అలాగే మంచి జీవితం జీవించే ప్రవక్త మంచి ప్రవచనం చెప్పగలడు. చెడ్డ జీవితం జీవించే ప్రవక్త మోసపు ప్రవచనాలు చెప్పగలడు.

5. ప్రజల ఆదరణను సంపాదించి వాళ్లనుండి ఏదో లాభాన్ని పొందాలి అన్న కక్మూర్తితో వాళ్ల తప్పలను సమర్థిస్తూ మాట్లాడే ప్రవక్తలను నమ్మకూడదు, వాళ్లు వట్టి స్వార్థపరులు, ప్రభువు బాబిలోనియా రాజుల నుండి యిప్రాయేలుకు ముప్ప వాటిల్లేలా చేయబోతున్నాడు. ఈ సంగతి యిర్మీయా ప్రజలకు తెలియజేసాడు. కాని కొందరు ప్రవక్తలు ప్రజల మొప్ప పొందగోరి వాళ్లకు ఏయపాయం కలగదని పల్కుతున్నారు. ఈలాంటివాళ్ల పల్ములు నమ్మకూడదు - యిర్మీ 23,16-17.

6. పై సూత్రాలన్నీ ఒక యెత్తు, ప్రవక్త తన పిలుపు విూద తనకే నమ్మకం వుందని చెప్పకోవడం ఒక యెత్తు, మంచి ప్రవక్త యెప్పడు గూడ భగవంతుడు తన్ను ప్రవచనం చెప్పడానికి పిల్చాడని గాఢంగా విశ్వసిస్తాడు. అందుకే గొప్ప ప్రవక్తలంతా తమ పిలుపుని గూర్చి విపులంగా చెప్పకొన్నారు. ఈ యంశాన్ని మొదటి అధ్యాయంలో చూచాం. ఆమోసు గొర్రెలు కాచుకొంటూ అంజూరపు నారు పెంచుకొంటూ వుండగా ప్రభవ అతన్ని పిల్చాడు. సింహం గర్జిస్తే ప్రజలు ఏలా తప్పకుండా భయపడతారో అలాగే ప్రభువు పిల్చిన భక్తుడు తప్పకుండా ప్రవచనం చెప్తాడు అన్నాడు ఈ ప్రవక్త కనుక అతనికి తన ప్రవచనాన్ని గూర్చి ఏమిరా అనుమానం లేదు — ఆమో 3,7-8. అలాగే