పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 277 P.pdf/25

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రభువు యెహెజ్కేలుతో "ఓయి! నేను నిన్నునా ప్రజకు కావలివానినిగా నియమించాను. నేను నీకు చేసే హెచ్చరికలను నీవు వారికి అందీయాలి" అన్నాడు - యెహె 3,17. ఆ మాటలు విన్నపిదప అతనికి తన ప్రవచనం విూద ప్రగాఢమైన విశ్వాసం కలిగింది. అలాగే యిర్మీయా యెషయా కూడ తమ పిలుపును గూర్చి సవిస్తరంగా చెప్పికొన్నారు. వీళ్ళ ప్రభువు తమ్మ పిల్చి తమచేత ప్రవచనం చెప్పిస్తున్నాడని పూర్ణంగా నమ్మారు. ఈలాంటి అనుభవం వున్నవాళ్ళు తప్పడు ప్రవచనాలు చెప్పరు. కనుక మనం వాళ్ళను నమ్మవచ్చు.

పై సూత్రాలు ఆనాడు లాగే యానాడు కూడ మంచి ప్రవక్త యొవడో తప్పడు ప్రవక్త యొవడో నిర్ణయించడానికి కొంతవరకు ఉపయోగపడతాయి.

5. ప్రవక్తల శ్రమలు

ప్రవక్తలు ప్రజాసేవకులు. ప్రజలకు దైవసందేశాన్ని విన్పించిన మహానుభావులు. కాని వాళ్లు తమ సేవలో ఘటోర శ్రమలు అనుభవించారు. మరీ కొందరు ప్రవక్తల బాధలు చూస్తూంటే మనకు మనసు కరిగిపోతుంది.

1. ప్రవక్తల బాధలు

ఎడారిలో యిస్రాయేలీయులు మోషే విూద తిరగబడ్డారు. ఐగుప్తలో ఐతే మాకు మాంసం మస్తుగా లభించింది. ఇక్కడ ఈ దిక్కుమాలిన మన్నా ఒక్కిటి తప్ప మరేమిరా దొరకడం లేదని గొణుగుకొన్నారు. అప్పడు మోషే ప్రభువుతో "నీవు ఈ ప్రజలను పరామర్శించే బాధ్యత నా నెత్తిన ఎందుకు పెట్టావు? నేను వీరిని కన్నానాయేమి? వీళ్ళ మాకు మాంసం ఇప్పించు కడుపార తింటామని నన్ను చంపకతింటున్నారు. వీళ్ళ బాగోగులను నేనొక్కడినే పరామర్శించలేను. నీవు నా యెడల ఇంత కఠినముగా ప్రవర్తిస్తున్నావెందుకు? అసలు నన్ను చంపివేయి, అప్పడు నేను వాళ్ళ ఇక్కట్టలను కన్నులార చూడవలసిన అవసరం లేకుండా పోతుంది" అన్నాడు — సంఖ్యా 11,10-15. ఈలాంటి ఆవేదనలు మోషే యెన్నో అనుభవించాడు. యిప్రాయేలీయులు బంగారు దూడను ఆరాధించినప్పడు గూడ మోషే వాళ్ళ తరపున ప్రభువుని మనవి చేసాడు. ప్రభువు తన మనవిని ఆలింపక పోయినట్లయితే తన పేరును ఆ ప్రభువు గ్రంథంలో నుండి కొట్టివేయవలసినదిగా కూడ విన్నపం చేసాడు - నిర్గ 32,32 ఆ ప్రజల తరపున అతడు అనుభవించిన ఆందోళనం అంత గొప్పది.

యిర్మీయా ఆనాటి ప్రజలకు ప్రభువు శిక్ష ఎరిగించాడు. బాబిలోను రాజులు వచ్చి యూదులను ప్రవాసానికి తీసికొని వెత్తారని చెప్పాడు. కాని రాజులూ అధికారులూ