పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 277 P.pdf/23

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రాజుని ఉబ్బించారు. రాజు మన్ననను సంపాదించడమే వాళ్లకు కావలసింది. కాని మిూకాయా ఈ సమాజానికి చెందని ప్రవక్త, అబద్దాలు చెప్పనివాడు. అతడు రామోతు మిూదికి యుద్దానికి వెళ్లే రాజు తప్పక ప్రాణాలు కోల్పోతాడని చెప్పాడు. తరువాత మికాయా చెప్పినట్లే అహాబు రామోతు పోరులో చనిపోయాడు - 1రాజు 22. ఈ సంఘటనంలోని సిదియా మరియు అతని అనుచరుల్లాగస్వార్ధలాభం కోసం దబ్బర ప్రవచనాలు చెప్పేవాళ్లు ఎప్పడూ వుండనే వుండేవాళ్లు ఈలాంటి అబద్దాల కోరులను గుర్తు పట్టడానికి మంచి ప్రవక్తలు కొన్ని సూత్రాలను సూచించారు. వాటిని పరిశీలించి చూద్దాం.

1. ప్రవక్త రాజకీ ప్రజలకీ కీడు కలుగుతుందని ప్రవచిస్తే ఆ ప్రవచనాన్ని శంకించనక్కర లేదు. కాని అతడు శత్రువులు ఓడిపోతారనీ యిస్రాయేలు దేశానికి శాంతి చేకూరుతుందనీ ప్రవచిస్తే ఆ వాక్యాలను శంకించాలి. రాజు మెప్ప కోసం అతడు అలా చెప్పి వుండవచ్చు. కనుక ఆ వాక్యాలు యథార్థంగా నెరివేరిందాకా వాటిని నమ్మకూడదు.

ఓమారు బాబిలోనీయులు ఐగుప్రీయులు పోరాడుతూ యిప్రాయేలుని ముట్టడించారు. యిర్మీయా బాబిలోనీయులే గెలుస్తారు కనుక వాళ్లతో ముందుగానే సంధి చేసికొమ్మని రాజుకు సలహా యిచ్చాడు. కాని దొంగ ప్రవక్తయైన హనన్యా రాజు మెప్ప పొందగోరి బాబిలోనీయులు ఓడిపోతారనీ పాలస్తీనా దేశంలో శాంతి నెలకొంటుందనీ ప్రవచించాడు. అప్పడు యిర్మీయా "ఓయి! మనకు ముందు వచ్చిన ప్రవక్తలంతా ఈ దేశంలో యుద్ధమూ కరువూ అంటువ్యాధులూ నెలకొంటాయని ప్రవచించారు. ఇప్పడు నీవు మాత్రం ఈ దేశంలో శాంతి నెలకొంటుందని చెప్శన్నావు. అలా శాంతి నెలకొన్న తరువాత గాని నీ వాక్యాల్లోని సత్యం రుజువకాదు" అన్నాడు. తరువాత యిర్మీయా చెప్పినట్లు గానే బాబిలోనీయులు గెలిచి యిప్రాయేలీయులను బందీలనుగా తీసికొని పోయారు. హనన్యా కూడ గతించాడు - యిర్మీ 28.

2. మంచి ప్రవక్త యెప్పడు కూడ తన ప్రవచనాన్ని గూర్చి కొన్ని గుర్తులు చెప్తాడు. సమూవేలు ప్రవక్త పౌలును తైలంతో అభిషేకించి ప్రభువు అతన్ని యిప్రాయేలుకు రాజుగా నియమించాడని ప్రవచించాడు. తన ప్రవచనంలోని సత్యాన్ని రుజువు చేసికోవడానికి అతడు కొన్ని గుర్తులు కూడ చెప్పాడు. సేవకులు వచ్చి సౌలు తండ్రి పోగొట్టుకొన్న గాడిదలు దొరికాయని సౌలుతో చెప్తారు. దారిలో తాబోరు సిందూరం వద్ద ఓ బాటసారి రెండు రొట్టెలను సౌలుకు కానుక యిస్తాడు. గిబియా వద్ద సౌలు ప్రవక్తల సమాజంలో చేరిపోయి తాను కూడ ప్రవచనాలు చెప్తాడు, సమూవేలు చెప్పినట్లుగానే తరువాత ఈ గుర్తులన్నీ నెరవేరాయి. కనుక దేవుడు సౌలుని రాజుగా నియమించాడన్నది వాస్తవం - 1సమూ 10,1-8