పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 277 P.pdf/228

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మన ఆలోచనలన్నీ వెర్రి ఆలోచనలని అతనికి బాగా తెలుసు. ఐనా ఆ ప్రభువు నరుణ్ణి స్మరించుకొంటూంటాడు. ఆదరిస్తూంటాడు, నరుడు భగవంతుని కంటె తక్కువవాడు గాని, సృష్టి ప్రాణులన్నిటికంటె ఎక్కువవాడు.

 కొంతమంది స్వీయబలంమీదనే ఆధారపడుతూంటారు. కాని దైవ బలంగూడ వండాలి. దేవుడు ఇల్లకట్టకపోతే ఇల్లకట్టేవాళ్ళ ప్రయాస అక్కర కొస్తుందా? కొంతమంది ప్రభువు పట్ల భయభక్తులు చూపుతూంటారు. అలాంటివాళ్ళ లోగిళు భార్యాపిల్లలతో కలకలలాడుతూంటాయి, అది ప్రభువు ଅବ୍ଧି దీవెన, దైవప్రజలు కలసి మెలసి ఒద్దికగా జీవిస్తుండాలి. దేవుని నమ్మని దుషులు మాత్రం కళ్లంలోని తాలులాగ గాలి కెగిరిపోతారు. ఇవి విజ్ఞాన వాక్యాలు.

<poem>1. మనం జీవించేది డెబ్బెయేండ్లు
మహా బలవంతులమైతే యెనభై యేండ్లు
 ఈ ఆయుష్కాలంలో గూడ బాధలూ చింతలూ తప్పితే
 మనం పాముకొనే దేమీలేదు
అనుకోకుండానే యేండ్ల గడచిపోతాయి
 మనమూ ఇక్కడ నుండి దాటిపోతాం
కనుక ప్రభో! ఈ జీవితం మూడునాళ్ళ ముచ్చటేనని
తెలిసికొనేలా చేయి
 అపుడుగాని మేము విజ్ఞానులం కాము - కీర్త 90, 10-12

2. నరుడు గడ్డిలాగ క్షణికమైనవాడు
 అతడు పొలంలోని పూవులా పూస్తాడు
 ఓ గాలి వీస్తుంది, అది కాస్త్ర రాలిపోతుంది
 ఇక అది ఎవరికంటా బడడు - 103,15-16

3. యిస్రాయేలు దేవుడు మనలను గమనించడనీ
 ప్రభువు మనలను గుర్తించడనీ కొందరనుకొంటూరు నాయనలార! మీరు వట్టి మందమతులు
మూర్ఖులార! మీకెప్పడు జ్ఞానం కలుగుతుంది?
 మన చెవులను చేసినవాడు తాను వినలేడా?
 మన కండ్లను కలిగించినవాడు తాను చూడలేడా?
 సకల జాతులను ఏలేవాడు వాళ్ళను శిక్షింపడా?
సకల నరులకు బోధించేవాడు వాళ్ళను ఎరుగడా?

</poem>