పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 277 P.pdf/227

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

3 దేవుడు ఆకాశం నుండి నరులను పరీక్షించి చూస్తుంటాడు
ఎవరైనా జ్ఞానం కలిగి తన్ను పూజిస్తున్నారా అని
పరిశీలించి చూస్తుంటాడు
ఐనా నరులంతా పెడత్రోవ బట్టారు
అంతా దుష్టులైపోయారు
నీతితో ప్రవర్తించేవాడు ఒక్కడూ లేడు - 53, 2-3
4 ఆకాశం ప్రభువది
భూమిని మాత్రం ఆయన నరుల కిచ్చివేసాడు - 115,16
5 ప్రభువు అంత గొప్పవాడైన దీనులను ఆదరంతో జూస్తుంటాడు
కాని గర్వాత్మలను మాత్రం దూరం నుండే గుర్తుపడతాడు - 138,6
6 నీ యాలోచనలతో నన్ను నడిపిస్తుంటావు
కడపట నన్ను నీ మహిమలోనికి చేర్చుకొంటావు - 73,24
7 నా నడకా, నా పడకా నీవు గమనిస్తూనే వుంటావు
నా ప్రవర్తన నీకు బాగా తెలుసు - 139,3
8 నీ యాత్మ నుండి నేనెక్కడికి పారిపోగలను?
నీ సన్నిధి నుండి నేనెక్కడికి తప్పించుకొని పోగలను - 136,7
9. నేను చేసే పనులన్నీ నీ పొత్తంలో వ్రాయబడే వున్నాయి
నా రోజులింకా ప్రారంభం కాకమునుపే
అవి యిన్నియని నీవు ముందుగానే నిర్ణయించావు - 139,16
10. నా ప్రార్థనను ధూపంలా స్వీకరించు
నేను చేతులెత్తి చేసే ప్రార్థనను సాయంకాలపు బలిలా ఆదరించు - 141,2

2 విజ్ఞానం


బైబులు విజ్ఞానాన్ని బోధిస్తుంది. నరుని ఆలోచనలు ఏలా వుండాలో అతడేలా మెలగాలో తెలియజేస్తుంది. మట్టితో జేయబడిన మనిషి మళ్ళా మంటగలిసిపోతాడు. అతడు జీవించేది ఓ డెభ్బైయేండ్లు ఈ కాలంలో గూడ బాధలూ చింతలూ తప్పితే అతడు పాముకొనే దేమీలేదు. ఈ జీవితం మీసాల మీది తేనెలాంటిది. నరుడు క్షణమాత్ర జీవి. ఇవ్వాళ్ళ ఓ పూవులా వస్తాడు, రేపటికల్లా రాలిపోతాడు. అతని రోజులన్నీ ఓ " నీడలా మరుగైపోతాయి. కొందరు మూర్శలు దేవుడు మనలను చూడడులే అనుకొంటూంటారు. కాని చెవిని చేసినవాడు వినడా? కంటిని చేసినవాడు చూడడా?