పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 277 P.pdf/229

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నరుల తలపోతలు ప్రభువునకు తెలుసు
 వాళ్ళు తెలివిలేని ఆలోచనలు ఆలోచిస్తారని
 ఆయనకు బాగా తెలుసు - 94,7-11
4.నీవు నరుణ్ణి స్మరించుకోవడానికి అతడేపాటివాడు?
 అల్ప మానవుణ్ణి పరామర్శించడానికి అతడెంతటివాడు?
 ఐనా నీవు నరుణ్ణి
 నీ కంటె కొంచెం తక్కువవాడ్డిగా మాత్రమే చేసావు
 కీర్తి మహిమలనే కిరీటంతో అతన్ని అలంకరించావు - 8,4-5

5.నీవు నరుణ్ణి ఆదరించడానికి అతడేపాటివాడు?
నరమాత్రుణ్ణి తలంచుకోవడానికి అతడెంతటివాడు?
 అతడు గబాలున వీచే గాలివంటివాడు
అతని రోజులు కనిపించకుండా బోయే నీడలా సమాష్టమౌతాయి - 144.3

<poem>6. నీవు మట్టితో జేయబడిన మనిషిని మళ్ళా మట్టిని జేస్తావు
 నరులారా మీరు మంటగలసిపొండని ఆజ్ఞాపిస్తావు 90,13

7.దేవుడు ఇల్లు కట్టకపోతే ఇల్లు గట్టేవాళ్ళ ప్రయాస అక్కరకు రాదు
 దేవుడు నగరాన్ని కాపాడకపోతే నగర రక్షకులు
 దాన్ని కాపాడగలరా!
వేకువనే లేచీ, అపరాత్రిదాకా మేల్కొని వుండీ
 పొట్టకూటికై ప్రాకులాడడం వ్యర్థమే.
 ప్రభువు తాను ప్రేమించేవాళ్ళకు సంపద నిస్తాడు – 127,1-2

8.నీ లోగిట నీ భార్య పండ్ల పండిన ద్రాక్షతీగలా వుంటుంది
 నీ బిడ్డలు ఓలివు పిలకల్లా యెదుగుతారు
ప్రభువు పట్ల భయభక్తులతో మెలిగేవాళ్ళకు
ఈలాంటి దీవెనలు లబిస్తాయి - 128, 3-4

9.దైవప్రజలంతా కలసిమెలసి అన్నదమ్ముల్లా జీవిస్తుంటే
చూద్దానికి యెంత ముచ్చటగా వుంటుంది! - 133,1

10.దుష్టులు గాలికెగిరే తాలులా కొట్టుకొనిపోతారు - 1,4

11.దేవునిపట్ల భయభక్తులు చూపడం విజ్ఞానానికి మొదటి మెట్టు
 పవిత్రుడైన ప్రభువుని తెలుసుకోవడమే వివేకం - సామె 9,10

12.దేవునికి భయపడ్డమే విజ్ఞానం
దుష్కార్యాలను మానడమే వివేకం - యోబు 28,28

</poem>