పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 277 P.pdf/209

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కొందరు దూతలను క్రీస్తకీ, మరియకూ దైవ సందేశం తీసికొని వస్తున్నట్లుగా చిత్రించారు. కొందరిని వేదసాక్షులకు కిరీటాలు, ఖరూరపు మట్టలు అందిస్తున్నట్లుగా చిత్రించారు. ఆ భక్తులు అనుభవించిన శ్రమలకు ఇవి బహుమతులు, సువిశేష రచయితలకూ, పునీతులకూ దివ్య ప్రేరణలు కలిగిస్తున్నట్లుగా చిత్రించారు. దైవార్చనలో దేవుజ్జీ, దివ్యసత్రసాదాన్నీ ఆరాధిస్తున్నట్లుగా గీసారు.

దేవదూతల్లోకెల్లామికాయేలు సుప్రసిద్దుడు. ఇతడు పిశాచంతోను సర్పంతోను పోరాడి ఆ దుష్ట శక్తులను జయిస్తున్నట్లుగా బొమ్మలు మలిచారు. ఇతన్ని భూలోకంలో నరుల పాపపుణ్యాలను తమ గ్రంథంలో లిఖిస్తున్నట్లుగా, పరలోకంలో చనిపోయినవారి మంచిచెడ్డలను తక్కెడలో పెట్టి తూస్తున్నట్లుగా మలిచారు. ప్రాచీన దేవాలయాల్లో కన్పించే ఈ బొమ్మలు, చిత్రాలు భక్తులకు తప్పకుండా ప్రేరణం పట్టిస్తాయి.

6. ఆధునికుల అవిశ్వాసం

ప్రస్తుత క్రైస్తవులు కొంతమంది దేవదూతలను నమ్మరు. దూతలు కేవలం బైబులు రచయితలూ కళాకారులూ సృజించిన కల్పనలు, కట్ట కథలు, ఊహలు అని చెప్తారు. ప్రాచీన నరుల కోరికలూ, భయాలూ దేవదూతలనూ దయ్యాలనూ సృజించాయని వాదిస్తారు. భూకంపాలు, వరదలు మొదలైన వినాశాలు ప్రకృతి నియమాల వల్లనే కలుగుతాయి, దేవదూతలు వీనిని కలిగించరు అంటారు.

సన్మనస్కులు ఆత్మ స్వరూపులు. మన కంటికి కన్పించేవాళ్ళు కాదు. కనుక వాళ్ళు నిజంగా వున్నారని మనం ప్రత్యక్షంగా నిరూపించలేం. ఐనా దేవదూతలు ఉన్నారని బైబులు మొదటి నుండి చివరిదాకా చెప్పంది. బైబులు రచయితలను కొంతవరకు ప్రభావితం చేసిన కనానీయులు, ఈజిప్ట ప్రజలు, పారశీకులుకూడ దేవదూతలను నమ్మారు. తిరుసభ దేవదూతలను నమ్మాలని అధికార పూర్వకంగా బోధించింది. మన హృదయంలోని విశ్వాసం కూడ దేవదూతలున్నారనీ, వాళ్ళు మనలను ప్రేరేపిస్తుంటారనీ హెచ్చరిస్తుంటుంది. చాల పర్యాయాలూ వాళ్ళనుండి సహాయం పొందామనే మన అనుభవం. ఇన్ని కారణాల వల్ల దేవదూతలు నిజంగా ఉన్నారని అంగీకరించాలి.

7. సన్మనస్కుల పట్ల భక్తి

దేవదూతల్లాగ మనకు ఉపకారం చేసేవాళ్ళేవరూలేరు. కనుక మనకు వాళ్ళపట్ల గౌరవం, భక్తి నమ్మకం, కృతజ్ఞతాభావం వుండాలి. 1. నిరంతరం మనతో మెలిగే దూతల పట్ల మనకు గౌరవం వండాలి. వాళ్ళ సర్వేశ్వరుని దర్బారులో యువరాజుల్లాగ సంచరిస్తుంటారు. దేవుని నుండి మన దగ్గరికి రాయబారులుగా వస్తారు. అన్ని విధాల నరమాత్రులమైన మనకంటె