పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 277 P.pdf/208

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రభువు నిన్ను తన దూతల అధీనంలో వుంచుతాడు నీవు ఎక్కడికి వెళ్ళినా వాళ్ళ నిన్ను కాపాడుతుంటారు నీ కాళ్ళ రాతికి తగిలి నొవ్వకుండేలా వాళ్ళ నిన్ను తమ చేతుల్లో ఎత్తిపట్టుకొంటారు

అని చెప్తుంది. నిర్గమనకాలంలో దూత యిస్రాయేలును నడిపించాడు - నిర్గ20, 20– 22. దూతలు మనలను పిశాచం నుండి కాపాడతారు. దయ్యానికీ మనకూ నిరంతరం యుద్ధం జరుగుతూంటుంది. ఈ పోరులో దూతలు మన పక్షాన నిలుస్తారు. మన కష్టాల్లో వాళ్ళు మనకు ఓదార్పు, శాంతి, ఆనందం దయచేస్తారు.

2. మనం పాపంలో పడిపోయినపుడు దూతలు మనకు పశ్చాత్తాపం, పరివర్తనం కలిగిస్తారు. మనలను చక్కదిద్దుతారు. పాపం వలన గాయపడిన మన ఆత్మకు చికిత్స చేస్తారు.

3. మన ప్రార్థనలను దేవునికి అర్పిస్తారు. రఫాయేలు తోబీతు సారాల ప్రార్థనలను దేవునికి అర్పించాడు - తోబీ 12, 12. ఒక దేవదూత దైవప్రజల ప్రార్థనలను ధూపకలశంలో ಪಟ್ಟಿ దేవనికి అర్పించాడు - దర్శ 8,8. పిశాచం, కావలి సన్మనస్కు ఎప్పడూ మన చుటూ ఉంటారు. పిశాచం మనకు చెడ్డ ఆలోచనలు, ప్రేరణలు పట్టిస్తుంది. సన్మనస్కు మంచి ఆలోచనలు ప్రబోధాలు కలిగిస్తాడు. మనకు ఒకరిద్దరు మంచి స్నేహితులు ఉండవచ్చు. కాని వారి కంటె మంచి స్నేహితుడు కావలి సన్మనస్కు అతన్ని గుర్తించకపోతే, అతని సహాయాన్ని పొందకపోతే, నష్టపోయేది మనమే. పునీత ఫ్రాన్సెస్ అనే భక్తురాలు తన కావలి సన్మనస్కును కంటితో చూచేది.

5. చిత్రాల్లో, బొమ్మల్లో సన్మనస్కులు

ప్రాచీన చిత్రకారులు నానా సందేశాలతో దూతల బొమ్మలు గీసారు. శిల్పులు నానా భావాలతో దూతల శిల్పాలు చెక్కారు, వీటిని వీక్షించడం వల్ల సామాన్య ప్రజలకు దూతల పట్ల నమ్మకమూ భక్తి పెరిగాయి.

సన్మనస్కులకు లింగం లేకపోయినా వారిని పురుషులనుగానే మలిచారు. వాళ్ళ యావనంలో బలంగా వున్నట్లుగా కన్పిస్తారు. బాల దేవదూతలుకూడ ఉన్నారు. వీళ్ళు బాల యేసునీ పిల్లలనూ సంరక్షిస్తున్నట్లుగా కన్పిస్తారు.

ఈ దూతలకు తెల్లని అంగీలు ఉంటాయి. వారి ముఖం నుండి కాంతి వెలువడుతూంటుంది. కొన్నిసార్లు వీళ్ళు సైనికుల్లాగ ఆయుధాలు ధరించి వున్నట్లుగా కన్పిస్తారు. వీళ్ళ రారాజు సేవలో, పిశాచంతో పోరాడే యోధులు.

మామూలుగా సన్మనస్కులకు రెక్కలుంటాయి. సెరాపకి ఆరూ, కెరూబుకి నాలూ, దూతలకు రెండూ రెక్కలుంటాయి. దేవుడు పంపగా నరుల దగ్గరికి శీఘంగా వచ్చే వార్తావహులని ఈ-రెక్కల భావం.