పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 277 P.pdf/210

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

గొప్పవాళ్ళ మనలను నిరంతరం దేవుని దగ్గరికి రాబడతారు. అలాంటి వాళ్ళపట్ల మనం గౌరవం చూపించవద్దా? పునీత జాన్ బర్మమాన్సు గారు తన గదిమందు నిల్చుండి తనకంటె ముందుగా తన కావలిసన్మనస్కు గదిలోకి ప్రవేశించాలని బ్రతిమాలుకొనేవాడు, పునీత ఇగ్నేప్యసుగారు త్రోవలో తన కెదురుపడిన వారి సన్మనస్కులకు నమస్కరించేవాడు. పనీత బెర్నారుగారు చెప్పినట్లు, అన్ని తావుల్లో అన్నివేళలా మనం సన్మనస్కులను గౌరవించాలి. మన పనులన్నిటికి వాళ్ళ సాక్షులుగా వుంటారు. మనమున్న చోట్లల్లా వాళ్ళ వుంటారు. కనుక మనం ప్రజల సమక్షంలో ఏ పనులు చేయడానికి జంకుతామో ఆ పనులను దూతల సమక్షంలో గూడ చేయకూడదు. వారిపట్లగల గౌరవంచే విశుద్ధంగా జీవించాలి.

2. దూతలు నిరంతరం దేవుని సన్నిధిలో వుండి అతన్ని పూజించేవాళ్ళ పరమ పవిత్రులు. మనలను పట్టించుకొని ఎల్లవేళల ప్రేమభావంతో మనకు సేవలు చేస్తుంటారు. మనమంటే వాళ్ళకు పరమప్రీతి. ఆలాంటి వాళ్ళపట్ల మనకు భక్తి వుండాలి. చిన్నతెరేసమ్మ తన ఆత్మకథలో "నేను బలహీనప బాలికనని యెరిగి బలవంతుడవైన నీవు నన్నుముందుకు నడిపించుకొని పోతున్నావు" అని వ్రాసికొంది. పునీత ఫ్రాన్సిస్ జేవియర్గారు తనకు మిక్కిలి ఇపులైన హిందూ జపాను దేశాల కావలి సన్మనస్కులకు ప్రతిరోజు చేయెత్తి నమస్కారం చేసేవాడు. పీటర్ ఫేబర్ అనే యేసుసభ గురువు ఆయా నగరాలకు వేదబోధ చేయడానికి పోయినపుడు ఆ పట్టణాల పొలిమేరల్లో ఆగి అచటి ప్రజల కావలి సన్మనస్కులకు ప్రార్థన చేసేవాడు. ఆ ప్రజలు తన బోధలను ఆలించేలా వారి హృదయాలను సిద్ధంచేయమని వేడుకొనేవాడు. పనీత బెర్గార్డుగారు "నీ సన్మనస్కుని నీ స్నేహితుని జేసికో. నీ యక్కరలు బాధలు ఎంత గొప్పవైనా అతని సహాయంతో నీవు గట్టెక్కుతావు" అని వ్రాసారు. కనుక మన కావలి సన్మనస్ముని భక్తితో స్మరించుకోవాలి. అన్నా! నీవు నాకు సహాయం చేయి అని ఎల్లవేళలా అతన్ని అడుగుకోవాలి.

3. మన సన్మనస్కు ఇన్నిసార్లు ఇన్నివిధాల మనకు సహాయం చేస్తూ వచ్చాడు. కనుక మనం అతన్ని నమ్మాలి. ఇతరులు మనలను నమ్మి మనపై ఆధారపడితే మనం సంతోషిస్తాంగాదా? దేవదూతకూడ అంతే. అతనికి మనకు సహాయం చేసే శక్తి వుంది, కోరికా వుంది. అతడు మనలను ఏనాడు అపమార్గం పట్టించడు. ఎల్లపుడూ దేవుని దగ్గరికే నడిపించుకొని పోతూంటాడు. కనుక అతనిపట్ల మనకు పూర్ణ విశ్వాసముండాలి. మనలను మనం అతని కాపదలకు అర్పించుకోవాలి. అతని అండదండల్లో వుండడం, అతని సలహాలు విని అతనిచే నడిపింపబడ్డం మహా భాగ్యం అనుకోవాలి.

4. ప్రతివొక్కరికీ ఒక కావలి సన్మనస్కు ఉంటాడు. విశేషంగా జ్ఞానస్నానం పొందిన వాళ్ళను అతడు జాగ్రత్తగా కాచికాపడుతూంటాడు. మనం పట్టినప్పటినుండి