పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 277 P.pdf/191

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

దాన్ని బుద్ధిపూర్వకంగా ఆహ్వానించాడు. తాను మరణమనే నీటిలో మునిగితేలాడు - లూకా 12,50. ప్రభువు మరణాన్ని చూచి కంపించి పోయాడు - యోహా 12, 27. దానినుండి తన్నుకాపాడమని తండ్రికి కన్నీటితో మొరపెట్టాడు - హెబ్రే 5,7. ఏ ప్రాణి చావడానికి ఒప్పకోదు. క్రీస్తుకికూడ చనిపోవడం ఇష్టంలేదు. ఐనా అతడు తండ్రి ఆజ్ఞకు బద్దుడై సిలువమరణం వరకు విధేయుడయ్యాడు - ఫిలి 2,8. సిలువ మరణం అనే పాత్రను త్రాగడానికి అంగీకరించాడు - మార్కు 14,36. క్రీస్తు విధేయత చాల గొప్ప పుణ్యం. అతడు యెషయా ప్రవక్త పేర్కొన్న బాధామయ సేవకుడు - యేష 53,12. అతడు నరజాతిలో పట్టి నరులతో ఐక్యమై నరుల పాపాలకొరకు చనిపోయాడు. మన పాపాల ఫలితమైన చావును తాను స్వీకరించాడు. మనలను కాపాడి తాను చనిపోయాడు.

భూమిలో పడిన విత్తనం చివికిపోయి మొలకెత్తి నూరంతలుగా ఫలిస్తుంది. అలాగే క్రీస్తు మరణంకూడ ఫలించింది - యోహా 12,24. అది మనకు పాపపరిహార బలి ఐంది. కయిఫా నుడివినట్లుగా అతడు నరులందరి కొరకు మరణించాడు - యెహా 18,14. విశేషమేమిటంటే, మనం పాపులమై యుండగా అతడు మనకొరకు చనిపోయాడు - రోమా 5,6. దానివలన అతని ప్రేమ ఎంత గొప్పదో తెలిసిపోయింది. అతడు మనకు బదులుగాకాక, మనకొరకు చనిపోయాడు. తన మరణం ద్వారా మనలను తండ్రితో రాజీ పరచాడు.

క్రీస్తు మరణానికి లొంగి దాన్ని గెల్చాడు. కనుకనే అతని మరణం సత్ఫలితాన్ని ఇచ్చింది. ఇక అతని రాజ్యంలో చావు వుండదు. అతడు మరణంనుండి ఉత్దితుడయ్యాడు. చావని గెల్చి మృత్యుంజయుడు అయ్యాడు. అతని వత్థానంతో మృత్యువుమీద అధికారంగల పిశాచం ఓడిపోయింది. క్రీస్తులో చావూ బ్రతుకూ ఒకదానితో ఒకటి పోరాడాయి. జీవన మూర్తియైన ప్రభువు చనిపోయాడు. చనిపోయి చావుని జయించాడు. ఇప్పడు విజయమూర్తిగా పరిపాలనం చేస్తున్నాడు.

క్రీస్తు చనిపోయినప్పటినుండి చావు రూపం మారిపోయింది. అతనిద్వార చావు నీడలో కూర్చుండి వున్న మనపై వెలుగు ప్రసరించింది - లూకా 1,79. అతడు రాకముందు మనం చావుకి బానిసలం. ఇప్పడు ఆ బానిసం తొలగిపోయింది. లోకాంతంలో నరులందరూ ఉత్థానమైనపుడు అతని వత్థానం మన పెన్నిద్ధురను పూర్తిగా నాశం చేస్తుంది -1 కొ 15, 26. "మరణమూ! నేనే నీకు మరణాన్నవతాను. నరకమా! నేనే నిన్ను నాశం చేస్తాను" అనే వుత్దానగీతం క్రీస్తుపట్ల పూర్తిగా నెరవేరింది.