పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 277 P.pdf/190

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

లేకుండానే దేవుణ్ణి చేరుకొన్నాడు - ఆది 5,24 పరలోక జీవితం కొరకే మక్కబీయుల కాలంలోని వేదసాక్షలు తమ ప్రాణాలు అర్పించారు -2 మక్క 7,9. యూదా మక్కబీయుడుకూడ చనిపోయినవారికొరకు బలులు ప్రార్థనలు అర్పించాడు -2 మక్క 12, 43-44.

ఈ సందర్భంలోనే యెషయా వర్ణించిన బాధామయ సేవకుణ్ణిగూడ పేర్కొనాలి. ఈ భక్తుని మరణం పాపపరిహార బలి అయింది. అతని మరణాన్ని అంగీకరించి దేవుడు చాలమంది దోషాలను మన్నించాడు. అతని మరణం ఎల్లరికీ జీవం పోసింది - యెష 53,8-12. ఈ సేవకుడు రాబోయే క్రీస్తే. ఇతనితో నూత్నవేదం ప్రారంభమౌతుంది.

2. నూత్నవేదం

చావు పాపంతో వచ్చిందనేది పూర్వవేదంలో ప్రధానాంశం. నూత్న వేదంలో క్రీస్తు మరణమే ముఖ్యాంశం. క్రీస్తు వచ్చిందాకా లోకంలో మృత్యువు రాజ్య మేలింది. క్రీస్తు ఈ మరణానికి లొంగి దాన్ని గెల్చాడు. ఇప్పడు మనం క్రీస్తులోనికి జ్ఞానస్నానం పొందినపుడు అతని మరణం మన మరణంమీద సోకుతుంది. అతనిద్వారా మనం మృత్యువుని జయిస్తాం. కనుక క్రీస్తు రాకడతో మరణస్వభావం పూర్తిగా మారిపోయింది. ఇక ఈ విషయాన్ని విపులంగా పరిశీలిద్దాం.

4. లోకంలో మృత్యురాజ్యం

లోకంలో మృత్యువు రాజ్యం చేస్తుంది. నరుని పాపంద్వారా చావు లోకంలోకి ప్రవేశించింది - రోమా 5,12. ఆదాముద్వారా అందరూ మృతి చెందారు-1కొ 15,22. చావ లోకాన్ని ఏలింది. ఈ చావు వెనుక పిశాచం హస్తంవుంది. అతడే ఆదాము మరణానికి కారకుడు. అతడు మొదటినుండి నరహంత - యోహా 8,44.

మృత్యువుకి బలం పాపంనుండే వచ్చింది. మరణం ముల్లు లేక కొండె పాపం -1 కొ 15,56. అనగా చావు మనలను పాపం అనే కొండెతో కుడుతుంది. పాప ఫలితమే చావు. క్రీస్తు రానంత కాలం మానవ జాతి మరణనీడలో కూర్చుండి వుంది. చావు గుప్పిటిలో చిక్కుకొని వుంది. ఈ మృత్యు బంధంనుండి మనలను విడిపించే నాథుడెవడు? క్రీస్తు.

5. క్రీస్తు మృత్యువుతో పోరాడి గెల్చాడు.

క్రీస్తు మన చావుని స్వీకరించాడు. అతడు మనచావుని తాను ఆహ్వానించి మనలను చావునుండి కాపాడాడు. మరణం అతనికి తలవని తలంపుగా రాలేదు. అతడే