పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 277 P.pdf/189

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పాపాన్ని దేవుడు అంగీకరించడ. పాపం నరుణ్ణి చావు దగ్గరికి ఈడ్చుకొని పోతుంది. కోరా మోషేకు ఎదురు తిరిగి పాపం చేయగా భూమి నెర్రెలువిచ్చి అతన్ని మింగివేసింది - సంఖ్యా 16,30-31. పాపులు మృత్యువుని స్నేహితురాలినిగా స్వీకరిస్తారు - జ్ఞాన 1,16. దేవుడు నరునికిచ్చిన వరాలన్నిటిలోను గొప్పవరం ప్రాణమే. పాపం ఈ ప్రాణాన్నిహరిస్తుంది. కనుక అది మహా దుష్టశక్తి ఐయండాలి.

3. చావునుండి విముక్తి

నరుడు తనంతట తాను చావుని తప్పించుకోలేడు. భగవంతుడు నిండు జీవం. కనుక మన చావుని అతడు తొలగింపవలసిందే. కావున భక్తులు మరణాన్ని తొలగించమని దేవునికి ప్రార్థన చేసారు. నీవు నన్ను పాతాళానికి పంపవద్దు. నీ పరిశుద్దుని గోతిపాలు చేయవద్దు అని వేడుకొన్నారు - కీర్త 16,10. తమ్ము ఆపదలనుండీ చావునుండీ కాపాడినందుకు దేవునికి వందనాలు చెప్పకొన్నారు. దేవుడు పాతాళంకంటె, మరణంకంటె శక్తిమంతుడు. కనుక నరులు అతనినుండి మరణ విముక్తినీ అమరత్వాన్నీ పొందాలని కోరుకొన్నారు.

కాని దేవుడు నరుణ్ణి వట్టినే మరణంనుండి విడిపింపడు. నరుని బంధనానికి కారణం పాపం. కావున అతడు పశ్చాత్తాపపడి పాపాన్ని విడనాడాలి. అందుకే ప్రభువు "ఎవడు చనిపోవడం వలన నాకు సంతోషం కలగదు. కనుక మీరు మీ పాపంనుండి వైదొలగి బ్రతకండి" అని హెచ్చరించాడు - యెహె 18,32. అందుచే నరుడు ఎప్పటికప్పుడు పశ్చాత్తాపంద్వారా తన పాపమాలిన్యాన్ని వదలించుకొంటుండాలి. ఈ కార్యంద్వారా జీవాన్ని అధికాధికంగా పొందుతుండాలి. ఈ దృష్టితోనే ఉపాధ్యాయుడు బాలుణ్ణి బెత్తంతో దండించి వాడి మూర్ఖత్వాన్ని వదలించాలి. వాడ్డి మృత్యువునుండి తప్పించాలి - సామె 23,13-14. ఫలితాంశమేమిటంటే, దేవుడు మనలను చావునుండి తొలగిస్తాడు. కాని మనం అడుగుకొన్నప్పడే.

నరుడు ఈ లోకంలో మృత్యువుని జయించడం మాత్రమేకాదు, పరలోకంలో శాశ్వతంగా జీవించాలని కూడ కోరుకొన్నాడు. ఈ కోరికపూర్వవేద భక్తుల్లో నిదానంగా కన్పించింది. "ప్రభువైన యావే మృత్యువుని సదా నాశంచేసి ఎల్లరి కన్నీళ్ళను తుడిచివేస్తాడు" అన్నాడు యెషయా - 25,8. చనిపోయి మట్టిలో నిద్రించేవాళ్ళు చాలమంది సజీవులౌతారు. వారిలో కొందరు నిత్యజీవాన్ని పొందుతారు అన్నాడు దానియేలు ప్రవక్త - 12,2. నీవు నీ వుపదేశంతో నన్ను నడిపిస్తావు, కడన నన్ను నీ తేజస్సులోనికి కొనిపోతావు అన్నాడు కీర్తన కారుడు - 73,24. పూర్వవేద ప్రజల్లో అమరత్వంమీద కోరికలు ఈలానే వికసించాయి. హానోకు చావు