పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 277 P.pdf/18

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఎత్తిపట్టుకొన్నారు. మోషే ఓ జెండాలాగ నిశ్చలంగా నిలబడి ప్రార్ధనం చేసాడు. ఆ ప్రార్థనా ఫలితంగా కొండ క్రింద యోషువా శత్రువులను జయించాడు - నిర్గ 17,8-13. ఇంకోమారు, కాడేషు బార్నెయా వద్ద యిస్రాయేలీయులు ప్రభువు విూద తిరగబడ్డారు. ప్రభువు ఆగ్రహించి వారిని సర్వనాశం చేయాలనుకొన్నాడు. కాని మోషే నలబదినాళ్ల దేవుని ముందట చాగలిపడి ప్రజలను క్షమింపమని వేడుకొన్నాడు. "ప్రభూ! నీవు యిప్పడు ఈ ప్రజను నాశం జేస్తే ఐగుప్రీయులు నిన్ను ఆడిపోసికొంటారు. యావే యిస్రాయేలీయులను కనాను మండలానికి చేర్చలేకపోయాడు, అసలు ఆ ప్రజలంటే అతనికి గిట్టదు. కనుకనే వాళ్ళని మోసంతో ఎడారిలో చంపివేసాడు - అని నిందలు మోపుతారు" అన్నాడు. అతని మొర ఆలించి ప్రభువు యిస్రాయేలీయులను చంపకుండా వదలివేసాడు - ద్వితీ 9,25-29, ఈలా ప్రవక్తలు ప్రజల తరపున ప్రార్థనలు చేసేవాళ్లు,

3. ప్రవచన ప్రక్రియలు

ప్రవచన ప్రక్రియలు రకరకాల రూపాల్లో వుండేవి. నోటితో మాట్లాడ్డం వాటిల్లో ఒక్క ప్రక్రియ మాత్రమే. ఈ క్రింద ప్రవచన రూపాలను కొన్నిటిని పరిశీలిద్దాం.

1. దైవవాక్కు

ఒకోమారు ప్రవక్త దేవుని సందేశాన్ని సంగ్రహమైన వాక్కుతో చెప్తుంటాడు. కొన్నిసారులు ఇది మూలంలో ఛందోబద్ధంగా గూడ వుంటుంది. సౌలు అమాలెకీయుల మిదికి యుద్ధానికి పోయాడు. ప్రభువు వారీ ప్రజలనూ, జంతువులనూ శాపం పాలు చేసి సర్వనాశం చేయమని చెప్పాడు. కాని సౌలు అమాలెకీయులను ఓడించిన తరువాత వాళ్ల రాజైన అగాగును చంపకుండ వదలివేసాడు. పైగా వాళ్ల పసుల్లో పోతరించిన వాటినన్నిటినీ తాను తీసికొని బక్కచిక్కినవాటిని మాత్రం చంపించాడు. ఈలా అతడు దేవుని ఆజ్ఞ మిరాడు. అప్పడు సమూవేలు ప్రవక్త వచ్చి

"నీవు ప్రభువు మాట త్రోసిపుచ్చాడవు కనుక

ప్రభువు నీరాచరికాన్ని త్రోసివేసాడు"

అన్నాడు - 1సమూ 15,20. తరువాత సౌలు ఎంత మొత్తుకొన్నా లాభం లేకపోయింది. ఈలాంటి ప్రవచనాలను దైవవాక్కులు అంటాం.

2 ఓదార్పు వాక్యాలు

ప్రవచనంలో ఓ ముఖ్యాంశం కష్టాల్లో వున్నవారిని ఓదార్చడం. తల్లి బిడ్డను ఓదార్చినట్లుగా ప్రవచనం భక్తులను ఓదారుస్తుంది. యూదులు బాబిలోను ప్రవాసంలో