పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 277 P.pdf/19

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చిక్కి మగ్గిపొతున్నారు. పాలస్తీనా దేశాన్ని మల్లా కంటితో చూస్తామో లేదో అని నిరుత్సాహ పడుతున్నారు. అప్పుడ యెషయా ప్రవక్త శిష్యుడొకడు ప్రభువు పేర ఈ ఓదార్పు వాక్యం విన్పించాడు.

"ప్రభువు బాహుబలంతో

పరిపాలనం చేయడానికి వస్తాడు

తాను విముక్తులను చేసిన ప్రజలను

అతడు తనతో తీసికొని వస్తాడు

గొర్రెలకాపరి మందను లాగ

అతడు తన ప్రజలను కాపాడతాడు

గొర్రెపిల్లలను ప్రోగు జేసి

వాటిని తన రొమ్ము విూద మోసికొని వస్తాడు

వాటి తల్లలను మెల్లగా అదలించుకొని వస్తాడు"

గొర్రెల కాపరి మందను తోలుకొని వచ్చినట్లుగా ప్రభువు తన ప్రజలను బాబిలోను నుండి తరలించుకొని వస్తాడని పై ప్రవచనం భావం. ఈ వాక్యాలు ఆ ప్రభువు కరుణనూ దయాళుత్వాన్నీ సూచిస్తాయి. ఈలాంటి వాక్యాలతో ప్రవక్తలు బాధలో వున్న ప్రజలను ఓదార్చారు – యొష 40,10-11.

3. ప్రార్థనలు

ఒకోమారు ప్రవక్తలు ఆత్మవలన ప్రబోధితులై ప్రజల తరపున ప్రార్ధనం చేయడం కూడ కద్దు. ఎజ్రా యిస్రాయేలు ప్రజలను బాబిలోను ప్రవాసం నుండి తీసికొనివచ్చాడు. కాని వాళ్లు యెరుషలేమను చేరుకొన్న పిదప ఆ వచ్చిన వాళ్లల్లో చాలమంది అన్యజాతి స్త్రీలను పెండ్లాడారని తెలియవచ్చింది. అది మోషే ధర్మశాస్తానికి విరుద్ధం. కనుక యొజ్రా దిగులుతో చతికిల బడ్డాడు. ప్రజలను క్షమింపమని ప్రభువుకి పశ్చాత్తాప ప్రార్థన చేసాడు. ఆ ప్రార్ధన వలన మనసు కరిగి యూదులు ఆ యన్యజాతి స్త్రీలను పరిత్యజిస్తామని మాట యిచ్చారు - యెజ్రా 9,10-15. ఇక్కడ ఈ ప్రార్ధన యిప్రాయేలీయుల్లోని ఓ దురాచారాన్ని పరష్కరించడానికి ఉపయోగపడింది. ఈలాగే నూత్నవేదంలో జెకర్యా సిమియోను పల్కిన ప్రవచనాలు కూడ ప్రార్థనలే - లూకా 1,67-80; 29-32.

4. పాటలు

ప్రార్థనలతో లాగే, ఓదార్పు వాక్యాలతో లాగే, ప్రవక్త ఒకోమారు పాటతో గూడ ప్రవచనం చెప్తాడు. యెషయా ఈలా పాట కట్టాడు. 12