పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 277 P.pdf/17

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ద్వారా నగరంలో హెచ్చరికలు చేసారు. కనుక నగరంలోని క్రైస్తవ భక్తులంతా ప్రక్క పట్టణమైన పెల్లాకు పారిపోయి ప్రాణాలు రక్షించుకొన్నారు. ఈలా ప్రవచనం ద్వారా ప్రభువు తన భక్తులకు సలహా యిస్తూండడం కద్దు.

6. వాగ్దానాలు చేసారు

ప్రవక్తలు చేసిన ఓ గొప్ప సేవ ప్రభువుపేర వాగ్దానాలు చేయడం. దావీదురాజు వైభవంతో "రాజప్రాసాదంలో వసిస్తున్నాడు. కాని ప్రభువు మందసం మాత్రం ఇంకా గుడారంలోనే పడివుంది. కనుక అతడు ప్రభువు మందసానికి ఓ మందిరం కట్టించాలని కలప సిద్ధం చేసి వుంచాడు. ఐవా దావీదు యుద్దాలు చేసి నెత్తురు ఒలికించినవాడు కనుక అతని చేతిమిూదిగా దేవాలయం కట్టించుకోవడానికి ప్రభువుకి యిష్టం లేదు. (1 దినవృ 28,3) దావీదుకు బదులుగా అతని కుమారుడు సొలోమోను దేవాలయం కట్టాలని ప్రభువు నిశ్చయించుకొన్నాడు. ఐనా దేవాలయాన్ని కట్టిద్దామనే మంచి కోరికను కోరుకొన్నందుకు ప్రభువు దావీదును సత్కరించాలని కూడ కోరుకొన్నాడు. కనుక అతడు నాతాను ప్రవక్తను పంపి దావీదుతో ఈలా చెప్పించాడు. "నీవు నాకు మందిరం కట్టనక్కర లేదు. నేనే నీకో మందిరం కట్టిపెడతాను. నీకు పుట్టబోయే కుమారుడు నాకు దేవళం కడతాడు. నేనతని సింహాసనాన్ని కలకాలం వరకు స్థిరపరుస్తాను" - 2సమూ 7,1113. ఇక్కడ ప్రభువు దావీదుకు కట్టిపెట్టే మందిరం అతని రాజవంశమే. ఈ రాజవంశం దావీదు సొలోమోనుల నుండి మెస్సియా కాలం వరకు అవిచ్చిన్నంగా కొనసాగుతుంది. ప్రభువు దావీదు వంశాన్ని కలకాలం వరకు స్థిరపరుస్తాననడంలో భావం యిదే. ఈ దావీదు రాజవంశం నుండే మెస్సీయా ఉద్భవించేది. మెస్సీయా దావీదు రాజవంశంలో పుడతాడు అనే ప్రవచనాల్లో ఇదే మొట్టమొదటిది. ఈలా యిక్కడ నాతాను ప్రవక్త మెస్సియాను గూర్చి వాగ్దానం చేసాడు.

7. ప్రజల తరపున ప్రార్ధన చేసారు

ప్రవక్తలు ప్రార్థనామూర్తులు. యిప్రాయేలీయులు ఎడారిలో ప్రయాణం చేస్తూరెఫిదీము దగ్గరికి వచ్చారు. అక్కడ అమాలెకీయులు వారిని ఎదిరించి పోరాడారు. యోషువావాళ్ళతో యుద్ధం చేస్తున్నాడు. మోషే కొండయెక్కి చేతులెత్తియిస్రాయేలు తరపున ప్రార్ధనంచేసాడు. అతడు చేతులెత్తినంతసేపు యిప్రాయేలీయులు గెలిచారు, కాని మోషే చేతులుబరువెక్కివాటిని దించగానే అమాలెకీయులు గెలిచారు. అప్పడు మోషే అన్న అహరోను, యోషువా తండ్రి హూరు మోషేకు అటుప్రక్కా యిటుప్రక్కా నిలబడి అతని చేతులు