పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 277 P.pdf/164

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఇద్దరు దైవ వ్యక్తుల పంపకం నేడు మన పంపకానికి ప్రేరణం పట్టిస్తుంది. క్రీస్తు తండ్రిచే పంపబడ్డవాడు. తన తరపున తాను శిష్యులను పంపేవాడు - యోహా 20,21. ఆత్మడు తండ్రి నుండి బయలుదేరి క్రీస్తుద్వారా లోకంలోకి వచ్చేవాడు - 15,26. ఈ యాత్మడు వచ్చాకనే తిరుసభ లేక దైవప్రజ ప్రారంభమైంది. నేడు తిరుసభను వేద బోధకు పరికొల్పేది ప్రధానంగా ఈ యాత్మడే అతడు క్రీస్తుఉద్యమాన్ని కొనసాగించేవాడు కదా! కుమారుడు పవిత్రాత్మ తండ్రి నుండి బయలుదేరి లోకంలోకి వచ్చినట్లే నేడు మనం కూడ వేదబోధకు లోకం లోనికి పోవాలి. ఆ దైవవ్యక్తుల పంపకం మన పంపకానికి ఆదర్భం, ప్రేరణం కూడ.

3. వేదబోధను గూర్చిన క్రీస్తు ఆజ్ఞ

నల్లరు సువిశేషకారులు వేదబోధను గూర్చిన క్రీస్తు ఆజ్ఞను పేర్కొన్నారు. కాని నల్గురు తమ సొంత భావాలను అనుసరించి ఆ యాజ్ఞను వేరువేరు విధాలుగా వర్ణించారు. మార్కు గ్రంథం ప్రకారం, శిష్యులు వేదబోధ చేయాలి. ప్రభువుని విశ్వసించినవారిలో వివిధ అద్భుత శక్తులు కన్పిస్తాయి, 16, 15-18. మత్తయి సువిశేషం ప్రకారం, ఉత్థాన క్రీస్తుకి సర్వాధికారం వుంటుంది. శిష్యులు వేదబోధ చేయాలి. ముగ్గురు దైవవ్యక్తుల పేర్ల మీదిగా నరులకు జ్ఞానస్నానమీయాలి. ఉత్థాన క్రీస్తు సాన్నిధ్యం క్రైస్తవ సమాజాన్ని నడిపిస్తుంది - 28, 18-20. నేడు మనకు బాగా పరిచయమైంది ఈ మత్తయి సువిశేష భాగమే. లూకా సువిశేషం ప్రకారం, శిష్యులు వేద బోధ, చేయాలి. వాళ్ల ప్రభువుకి సాక్షులుగా గూడ వుండాలి. ఆత్మను పొందాలి - 24, 45-48. యోహాను పుస్తకం ప్రకారం, శిష్యులు వేదబోధకు పంపబడతారు. పవిత్రాత్మను పొంది పాపాలను మన్నిస్తారు - 20, 21-23. పై యాలోకనాల్లో నల్లురు సువిశేషకారులు వేదబోధ చేయడం ముఖ్యమని చెప్పారు. ఈ బోధను గూర్చిన క్రీస్తు ఆజ్ఞ నేడు మనకు ప్రేరణం పట్టించాలి. క్రీస్తు అనుచరులు ప్రధానంగా ఆ ప్రభువుని బోధించేవాళ్ళు.

4.జూబిలీ

2000 యేట క్రీస్తు ప్రభువు పేరుమీదిగా జూబిలీ జరుపుకొన్నాం. అసలు జూబిలి అంటే యేమిటి?

పూర్వవేదంలో ప్రతి 50వ యేటిని జూబిలి సంవత్సరంగా పాటించేవాళ్ళు ఆయేడు బానిసలకు విమోచనం లభించేది. అన్యాక్రాంతమైన భూములు తిరిగి