పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 277 P.pdf/165

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సొంతదారులకు ముట్టేవి - లేవీ 25,8-10. హీబ్రూలో యోబెల్ అంటే పొట్టేలికొమ్ము. యూదులు ఈ కొమ్మని బూరగా వాడేవాళ్ళు ఈ బూరను ఊదడంతో జూబిలి సంవత్సరం ప్రారంభమయ్యేది. ఇంగ్లీషు మాటయైన జూబిలి ఈ యోబెల్ పదం నుండే వచ్చింది.

నూతవేదంలో క్రీస్తుకూడ ఈ జూబిలి సంప్రదాయాన్ని పాటించాడు. అతడు తన వేదబోధను ప్రారంభించినపుడు నజరేతు ప్రార్థనా మందిరానికి వచ్చి జూబిలి ఉత్సవాన్ని ప్రకటించాడు. ప్రభువు దాన్నిహితవత్సరం అన్నాడు — లూకా 4,18-19. ఈ హితవత్సరం ద్వారా అతడు పేదలకు సువార్తను బోధించడానికీ, పీడితులకు విమోచనాన్ని దయచేయడానికీ పూనుకొన్నాడు. క్రీస్తు బోధలు అద్భుతాల ద్వారాను, మరజోత్థానాల ద్వారాను ఈ విమోచనం సిద్ధించింది. తర్వాత పవిత్రాత్మ శిష్యుల మీదికి దిగివచ్చి ఈ జూబిలీని లేక విమోచనాన్ని తిరుసభ అంతటికీ వ్యాపింప జేసింది. 2000 సంవత్సరంలో మనం జరుపుకొన్న జూబిలికూడ ఈ క్రీస్తు జూబిలికి కొనసాగింపే. ఈ జూబిలి సందర్భంలో, క్రీస్తు అంతటి గొప్ప రక్షకుణ్ణి దయచేసినందుకు మనం తండ్రిని స్తుతించి కీర్తించాం. నేడు మన క్రైస్తవ పెద్దలు జరుపుకొనే జూబిలికూడ పై బైబులు సంప్రదాయం నుండి వచ్చిందే. ఇప్పుడు జూబిలి అంటే ఉత్సవం, వేడుక, కృతజ్ఞత అనే భావాలు వ్యాప్తిలో వున్నాయి.

4. భారతదేశ పరిస్థితి

1. వేదజోధలో మాంద్యం

పూర్వం మనదేశంలో వేదబోధ మ్ముమ్మరంగానే జరిగేది. కాని యిప్పుడు ఈ వుద్యమం చప్పబడి పోయింది. ఏవరో పేద దళితులు కొద్దిమంది తప్ప ఇప్పుడు క్రైస్తవ ధర్మాన్ని స్వీకరించేవాళ్ళు అరుదు. నేడు వేదబోధ చేయడానికి ఉత్సాహం చూపేవాళ్ళు తక్కువై పోతున్నారు. దీనికి కారణాలు చాలా వున్నాయి.

1. నేటి వేదశాస్ర్తులు కొందరు వేదబోధను గూర్చి చులకనగా మాట్లాడుతున్నారు. వీళ్ల భావాల ప్రకారం ఇతర మతాల్లో కూడ రక్షణం లభిస్తుంది. క్రీస్తు ఏకైక రక్షకుడు కాదు. కనుక శ్రమపడి వేదబోధచేయడం, అన్నిమతాల వారిని క్రైస్తవ మతంలోకి రాబట్టడం అంత అవసరం కాదు. ఈలాంటి భావాలను జీర్ణంచేసికొన్నయువగురువులు వేదబోధపట్ల ఆసక్తిని కోల్పోతున్నారు.

2. మన దేశంలో హిందూనాయకులు తీవ్రవాదులు వారి మతాన్ని పునరుద్ధరించుకొనే ప్రయత్నంలో వున్నారు. మతం పేరుమీదిగా అంతట ఘర్షణలు