పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 277 P.pdf/163

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

6-8. క్రీస్తు చాలసార్లు తన్ను తండ్రిచే పంపబడినవాణ్ణిగానే వర్ణించుకొనాడు . ఉదాహరణకు అతడు నన్ను పంపినవాని చిత్తాన్ని నెరవేర్చడం, అతని పనిని పూర్తి చేయడం నాకు ఆహారం అన్నాడు - యోహా 4,34.

క్రీస్తు ప్రవక్తలందరిలోను గొప్పవాడు. అతడు ప్రజలకు తండ్రినిగూర్చి తెలియజేసాడు. తన మరజోత్థానాలద్వారా వారి పాపాలకు పరిహారం చేసాడు. అతడు తిరిగి పిత దగ్గరికి వెళ్ళిపోకముందు శిష్యులతో "తండ్రినన్ను పంపినట్లే నేనూ మిమ్మ పంపుతున్నాను" అన్నాడు - యోహా 20,21. క్రీస్తు తర్వాత శిష్యులు పంపబడినవాళ్లుగా వేదబోధ చేయాలి. కనుకనే ఉత్థానక్రీస్తు వారితో "మీరు ప్రపంచమంతట తిరిగి సకల జాతులకు సువార్తను బోధించండి" అని చెప్పాడు - మార్కు 16,15. తనకు సాక్షులుగా వండమని ఆజ్ఞాపించాడు - అ.చ. 1,8.

ప్రభువు అన్యజాతులకు బోధ చేయడానికి పౌలుని ప్రత్యేకంగా ఎన్నుకొన్నాడు - అ. చ. 22,21,.పేత్రు యూదులకు లాగే అతడు గ్రీకు రోమను ప్రజలకు సువార్తను బోధిస్తాడు. " కాని క్రీస్తునిగూర్చి బోధించాలన్నా అతనికి సాక్షులుగా వుండాలన్నా శిష్యులకు శక్తి చాలదు. కనుక ఉత్థానక్రీస్తు పెంతెకోస్తుదినాన శిష్యుల మీదికి పవిత్రాత్మను పంపాడు, ఆ యాత్మ శక్తితోనే వాళ్లు నేల నాలుగు చెరగుల వరకు పోయి వేదబోధ చేస్తారు. క్రీస్తుకి సాక్షులౌతారు - అ,చ. 1,8. నేడు మనం పైయపోస్తలుల స్థానంలో వుండి వారికి అనుచరులంగా మెలుగుతూ, వేదబోధ చేయాలి. క్రీస్తులోనికి జ్ఞానస్నానం పొందిన వాళ్లంతా క్రీస్తుని బోధింపవలసిందే దేవుని ఆత్మే మనలను దేవుని బిడ్డలనుగా చేసి, మనచే వేదబోధ చేయిస్తుంది - గల 4,6.

2. కుమార పవిత్రాత్మల పంపకం

పవిత్ర త్రీత్వమే మన ప్రేషిత సేవకు ఆధారం, తీత్వంలోని తండ్రి కుమారుని ఈ లోకంలోకి పంపాడు. క్రీస్తు ఈ లోకంలోకి వచ్చి నరులకు తండ్రి ప్రేమను తెలియచేసాడు. అటుపిమ్మట తండ్రి కుమారుని ద్వారా ఆత్మను కూడ ఈ లోకంలోకి పంపాడు. అతడు క్రీస్తు ప్రారంభించిన రక్షడోద్యమాన్నిలోకాంతం వరకు కొనసాగించుకొని పోతాడు. ఉత్థాన క్రీస్తు తన తరఫున తాను శిష్యులను వేదబోధకు పంపాడు, ఈ వేదబోధనే నేడు మనంకూడ కొనసాగించుకొని పోయేది. ఈలా తండ్రి మొదట కుమారునీ ఆత్మనూ పంపడమే నేడు మనంకూడ వేదబోధకు పంపబడ్డానికి ఆధారం.