పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 277 P.pdf/162

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మూడవ వర్గంవాళ్ళు క్రైస్తవులుకాని అన్యమతాల ప్రజలు. వీళ్లు విశేషంగా ఆఫ్రికా ఖండంలో, ఇండియా చైనా దేశాల్లో అస్ట్రేలియాలోని ఆదిమవాసుల తెగల్లో వున్నారు. ప్రస్తుత వేదబోధ వీళ్లకు మొట్టమొదటి సారిగా విశ్వాసాన్ని పట్టిస్తుంది. ఈ విధంగా ఈ బోధ మూడు పెద్ద వర్గాల ప్రజలను ప్రభావితం చేస్తుంది. 5. నూత్న వేదబోధ పరిధి ఏ మేరకు? ప్రజలకు జ్ఞానస్నానమిచ్చి వారిని క్రైస్తవ మతంలోకి చేర్చడం మాత్రమే ప్రస్తుత వేదబోధ లక్ష్యంకాదు. నరులు దేహాత్మలకు చెందిన సంపూర్ణ విమోచనాన్ని సాధించాలి. వాళ్లు సాంఘికంగా, ఆర్థికంగా, ఆధ్యాత్మికంగా విమోచనాన్ని పొందాలి. ఈ కార్యం క్రీస్తుద్వారా జరగాలి. నూత్న వేదబోధ ఆశయమిది.

2. బైబులు - వేదబోధ

ఇక్కడ మనం నాల్గంశాలు పరిశీలించాలి.

1. పంపకం

వేదబోధకులు ప్రధానంగా దేవునిచే పంపబడినవాళ్ళు. కనుక ఇక్కడ బైబుల్లోని "పంపకం" అనే భావాన్ని కొంచెం విపులంగా పరిశీలిద్దాం. పూర్వం వేదంలో మొదట పంపబడినవాళ్లు ప్రవక్తలు. వీళ్లు ప్రధానంగా ప్రభువు దాసులుగా, రాయబారులుగా ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్లకు ధర్మశాస్త్ర నియమాలను బోధించారు. ప్రజలు సీనాయి నిబంధనం షరతుల ప్రకారం జీవీంచాలని హెచ్చరించారు. పాపాలకు పశ్చాత్తాప పడమని నొక్కిచెప్పారు. మోషే మొదటి ప్రవక్త తర్వాత యేలీయా, యెలీషా, హోషేయా, యెషయా, యిర్మీయాలాంటి మహా ప్రవక్తలు దైవ వాక్కును విన్పించారు. యిస్రాయేలీయులు నడిపించిన యోషువా, సమూవేలు, దావీదు మొదలైన నాయకులు కూడ ప్రవక్తలే. పై ప్రవక్తలతో పాటు యిస్రాయులు జనమంతా గూడ పంపబడినవాళ్లే. ప్రభువు వాళ్లను అన్యజాతులకు జ్యోతిగా నియమించాడు -యోష 42,6. కనుక అన్యజాతులకు దేవుణ్ణి తెలియజేసి వాళ్లనుకూడ ప్రభువు దగ్గరికి రాబట్టడం ఆ ప్రజల పూచీ, అంత్యకాలంలో ఓ భక్తుడు ప్రభువుకి దూతగా వచ్చి అతనికి మార్గం సిద్ధం జేస్తాడని మలాకీ ప్రవచనం నుడుపుతుంది - 3,1. క్రీస్తు బోధల ప్రకారం ఈ దూత స్నాపక యోహానే. అతడు పూర్వవేదంలో చివరి ప్రవక్త. నూత్న వేదంలో తండ్రి పంపగా వచ్చినవాడు ప్రధానంగా క్రీస్తే, పిత మొదట తన సేవకులైన ప్రవక్తలను పంపి కట్టకడన తన కుమారుట్టే పంపాడు - మార్కు 12,